పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సలుప శైపక యది తొలగి క్రమ్మఱ నన్ను చేరుమటంచు చేఁగీర దాని
సన్నయు గనుగొని న్నదివిడకున్న పరగ జ్యేష్టకనిష్టభావములను
నారియీర్షాప్రీతు లారసి యేను జోడుగగూర్చి సమబంధమున బెనంగి
మార్పులు సేయుచు నేర్చున నొకతెకు [1]ముందు కళాస్రావ మొందజేసి


గీ.

సమ్మదముఁ జూపి పెఱదాని సైగజేసి క్రీడ గావించి కళ చిలికించి తనుప
ఖనత నిరువురు దృప్తులై నను నుతించుటె దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఇంతియొక్కతె దొడ్డయిల్లాలిననియుంచు దానిభావ మెఱుంగదలచి యొక్క
వెరపున నాలేమ వినుచుండ వెంబడితరుణితో లోకవార్తలుగ నేను
విటవిటీజనులు గావించుచేతలు పచ్చిపచ్చిగ దెల్ప కోపంబులేక
ఈర్ష్యనొందక నవ్వ నే నది వీక్షించి యింతి జిక్కెనని ధైర్య మెసఁగ నొంటి
నున్నచో నట్టినర్మోక్తులే జెప్పిన నవ్వుచు సిగ్గున నన్ను జూడ


గీ.

తరుణి సిగ్గేల యిక నంచు గరము బట్టి యొద్ద నిడుకొని యది వద్దువద్దనంగ
లేదులేదంచు గ్రీడసల్పిన నెలంత యన్యు లెరగిన గర్హింతు రన్నమాట
మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

అతివ నేనును నూత్నయౌవనమున నుండి సురతవైదగ్ధ్యంబు లెఱుగనితఱి
నితరేతరప్రేమ నెంతయు మితిలేక బెరుగు నేకాంతంబు దొరుకునపుడు
సంభాషణంబులు సలిపెదమని పొంచి సమయమైనప్పుడు సాత్వికోద
యమున మాటాడలే కటు దాటిపోయిన మఱియొకవేళ దొరక
యొడ లంటగా బోవ వణకుచు చెయ్యి కాలాడకుండగ నుండ నవల దూతి
కలయగూర్చిన నధికప్రీతి నే రమించుట కేమిలేక యాసురభిళాంగి


గీ.

కొనరచే మెలుకువ చేసి మనసు దీర్చుకొనంగలే కిర్వురము నిట్లు కోర్కె బెల
చనఁగ నతికష్టమున గూడికొనినవిధము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకనాడు నేను తోటకు బోవదిమంచివేళ యంచొకతన్వి విభునితోడ
నమ్మగారింటికి నటుబోయివచ్చెద నని భర్తతో జెప్ప నాత డొకని
తోడిచ్చిపంపిన తోటయొద్దకు వచ్చి మఱచి వచ్చితి నేను వెరపు సొమ్ము
దెమ్ము నే నందాక నమ్మయింటికి బోవనని బొంకి పంపి తా నవల నన్ను

  1. ముందుకళాభావ