పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వక్రచేష్టల కాలవాలం బనందగు
             వక్రనాసుని కథ వర్ణ్యము కద !
అఖిలజారుగుండె లల్లార్చుగుధ్రియీ
             నాటకంబున కథానాయిక కద!
మందానిలాందోళి తేందీవరాది స
             త్సౌరభ చైత్రవాసరములు కద!


గీ.

విపఁగ వచ్చిన వీరెల్ల వేత్తలుకద!
ఇంక సభ్యుల మెప్పించు టెంత, నేను
వక్రనాసుఁడ నగుదు, నీ భగ్నినిగృధ్ర
యగుచు రావలె, నిక మారిషా! పద! పద!

మారి— నే నెవరి వేషము?
సూత్ర — వక్రవాసుని శిష్యులలో రెండవవాఁడగు కాసరుని వేషము.
మారి— మొదటివాఁడగు జంబుకుని వేష మెవరు వేయుదురు?
సూత్ర — జంబుకవేషము ధరించి రంగస్థలమునం బ్రవేశించు నా తమ్ము నింక నీవు చూడనేలేదా? వీఁడు.
ఉ.

చందనపుం దిపుండ్రము పసందుగ దిద్ది లలాటదేశమం
దంచముగాఁ గపోలతల మందునఁ దమ్మను వామహస్తమం
దుందళముల్ ధరించి వలతోరపుచేతను వీటిఁ దాల్చి వాఁ
టందుల నేగుదెంచె మన మాత్మవిధిం బచరింపఁ బోదగున్.

(ఇద్దఱు నిష్కమింతురు.)

ఇది ప్రస్తావన.