పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

మాధవ, ప్రక్కలో నులకమంచముపై నిను వేసికొంచు తా
బాధలు చిన్నటంబడియె, బ్రాయమునం బువుఁబాన్పుమీఁద ని
న్నే ధవురీతిఁ జేర్చికొని యెంతయు మన్మథసౌఖ్యములు గనెన్
రాధిక కచ్చ నుచ్చయును, ఱైకను జేయి య టన్నవైఖరిన్.

20


ఉ.

కొంచెపుప్రాయ మందె రసికుం డగుచుం గసి దీఱ రాధికన్
దంచెను చిన్నికృష్ణుఁడు ముదంబొనఁగూర్చుచు నన్న వార్త చా
టించిన యట్లు ధాత్రిఁ బ్రకటిల్లెను. "పూకును డప్పుచేసి వా
యించుట” యన్నమాట కిదియే యగు కారణ మద్రిధారణా.

21


చ.

పటు విరహంపునొప్పులకుఁ బాల్పడి మోహముగన్న గోపికల్
కటకట! నీదు ప్రక్కఁబడఁగాఁ గడుఁ గోరియు, వస్త్రహీన లై
తటుకునఁ నీకుఁ గన్పడఁగఁ దద్దయు జంకిరి "మంత్రసానిముం
దటనె యుపస్థ దాఁచిన" విధంబున గోపవధూమనోహరా.

22


తే.

'నదిని నెల్వడి చేయెత్తి నాకు మ్రొక్క,
చేలముల నిత్తు', నని నీవు చెప్ప, గొల్ల
పడఁతులకు "పూకులోఁ బుండు, బావగారి
వైద్య” మను నట్టు లాయె నోవారిజాక్ష.

23


రత్నావళి.

"అమ్మఘవుజాతరన్ మానినచో నాపద వాటిల్లు నటంచున్
నెమ్మది భయపడనేల? “పూకు పెండ్లికి నగరకటకపున్ బాజా
సుమ్ము, మొడ్డపెండ్లికి ముఖలింగపుసొన్నాయిసు”మ్మనుట యిదియే
నమ్ము.” డని నీవు గొల్లలన్ మాన్పి, నగము నెత్త లేదే శౌరీ.

24


తే.

వజ్రసంరంభమున ఱాల వాన కురిసి
తుదకు. 'నత్త, నీకొడుకు గందోళిగాఁడె,
వత్తమీఁద చేతిని వేసి పల్కకుండు
నను నటులెచేసె, కృష్ణ, నీ వద్రినెత్త!

25


తే.

వనజనాభ నీ మొగముసొంపునకు వలచి,
పడఁతు లెందఱొ నీపయిఁ బడిరి "మొగము
తేట పూకుకు చే"టను మాట గలదు,
మొగముతేట మొడ్డకును జేటగుట క్రొత్త.

26