పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ్మును మునుకట్టి పొందు నిను మూఢతతోడ యశోదఱోట బం
ధన మొనరింప నెంచెనఁట దాన భయంపడినాఁడవే హరీ!
“చినిఁగినపూకు దెంగులకి సీ జడుపుం గనునే" యొ కప్పుడున్?

13


శా.

రాకాసుల్ నిను వేనవేలు బరిమార్పన్ బృంద యందుంటచే
నీ కేళీసమయంబు లందొకొకఁడే నిన్నా ఖలుల్ దాఁకరే?
'కాకుల్ గల్గినయూర నేకులను నేకం, గాకి యేతెంచి తాఁ
బూకుం బొడ్చె' న టన్న సామెతగతిన్ భూమీదవా, మాధవా.

14


క.

నినుఁ బరమాణుసమానుని
దన కుక్షిని నిలుపుకొనఁగఁ దలఁచి బకుఁడు మ్రిం
గె నహా! గం పంతటిపూ
కునా గాడిదమొడ్డ చిక్కుకొనునె మురారీ!

15


క.

కంఠముదిగిన యెడలను
శంఠంబును దెగ దటన్న సామెక యోవై
కుంఠా, యేమయ్యె బకు డ
కుంఠితగతి నిన్ను గ్రోలి కూలినవేళన్.

16


చ.

మదమున నిన్ను బట్టి పరిమార్ప నెదం దలపోసి కాళియుం
డెదురుగొనంగ, వానితల లెల్లను బిప్పిగ నీదుకాళ్ళతో
జదువగ లేదె నీవు? సరసంబునకున్ సరసుండు వోవ, జ
న్ను దగిలి కన్ను వోవుట కనుంగొన నిట్టిదె! గోపడింభకా.

17


మత్తకోకిల.

ఈతపండ్లకు చెట్టు నెక్కగ, నిత్తుపై ములు నాటిన
ట్లీత లాడ గళిందిజానది నీవు మున్జగ గాళియుం
డీతముల్ ఎఱుగంగ దెంగఁగ నెంచు నిన్ వడిబట్టి, యా
హా! తుదన్ పగనొందె శేషసయాన యోగరుడద్వజా.

18


చ.

గిలకకు నీరునున్ దిగిని కేవలబాలుని నిన్నుఁ బిల్చి, నీ
తళుకు మెఱుంగు చెక్కిలి ముదంబున నొక్కి, స్తనద్వయం బుర
స్థలమునఁ గ్రుమ్మి, రాధ రతి సల్పఁగ, అవ్వకు దూల తీఱిన
ట్టులు, మనుమండు నేర్చిన యటులు గనుపట్టెను గాదె మాధవా?

19