పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

తరుణి నొప్పించి యొప్పించి తాను గూడ ననంగబలాయెనంచు నే నభినుతింప
నాతి యుప్పొంగి చేసిన నాటిరతులు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వగలాడి వగటచే బిగువు గల్గగఁ జేసికొని రాగ నేజొన్పి వనిత జూచి
వగరుచేత రవంత బిగువుండునొక్కింత చెమ్మగిల్లినది యిమ్ముజూపు
రతిలోన దగనిద్దఱకును మంటని జూపుబిగువుకు నేనొక్క వెరవు జెప్ప
సక్థిద్వయము జేసి సాచుక పవళింప నిరుదెస కాళ్లుంచి యేను మీఁద


గీ.

జేరికూడి బిగువుజూపి చెలియె సంపృతోరుబంధ మిది యటన్న నౌర వింత
నేర్పితివటంచు మెచ్చిన నెలతమాట మదిదలంప బ్రహ్మానంద మదియకాదె


సీ.

అతివ యొకర్తు నే నన్యోన్యపాదముల్ ప్రక్కనుదలలుంచి పవ్వళించి
యెదురుగాదిరిగి మేమెడను కాళ్లను సాచి తలగడల్ చేసి క్రిందులకు వామ
కరములు సాచి పైకాళ్ళ సందులకు బోనిచ్చి కొంచెమువంచి యిలను పదము
లానించి దక్షిణహస్తంబులటు మోడ్చి పృథివిపై మోర యొక్కింత యుబికి
సరిజేసి వెసజొన్పి జాఱిపోకుండ ఖబద్ధారుగా వింతపరిఢవిల్ల


గీ.

చెలుపు మీఱంగ గూడి ఖుషిని జెంది నీవె సరి; నీవె సరి; యని నేర్పు మీఱ
యిరువురము మెచ్చుకున్న యానెరతంబున మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకరాత్రి నేను దర్పకయుద్ధమున లెక్క సలుపుచు ఘడియలు జరిపి నిలిపి
జాములు వెడలించ సరి నాకు సంతృష్టి గాకున్న చెలి నన్ను గాంచి, మందు
మహిమయో! మఱిమఱి మంత్రంబులో లేక తంత్రమో! యీ వింత ధరణి నెందు
గన్నది విన్నదిగా దింక తాళలేనని యొక్కచే పాద మవలచేత


గీ.

చుబుకమును బట్టి ప్రార్థింపజూచి కళను తక్షణమె డింప నూర్ధ్వరేతస్కుడవని
వనిత శాబాసుగిరి యొసంగిన పసందు మదిఁదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పడతి యొకనాఁడు పరిహాసింపదలంచి సమరతిఁ జేయుచు క్షణము నిలిపి
లలి తర్జనీమధ్యములలోని కటు జొన్పి యూర్ధ్వభాగంబున నున్న సలిల
నాడిక కదలించి ననువొప్ప ముందుపారిన యొంటేలు జాలనవ్వి
తోయజానన లిట్లు సేయుదురా? యని పరిహసింపగ వక్త్రపంకజంబు


గీ.

చిన్నబోవ దిగ్గున లేచి చీర ముడిచి యౌర యిది యేమి యాగడమంచు కళల
మందుకొని సందులకు బోయినట్టిహొయలు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.