పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మఱియొకనాడు సమర్తప్రాయముదాని మొలకచన్నులు గలముద్దులాఁడి
నెలమితో ఫలదానముల సొమ్ములను మేలిమాటల చేష్టల మరులు కొలిపి
విరులశయ్యకు దాల్చి వివృతోరుబంధక్రమంబుల సారె మరునిసిడము
దగిలించి చెమ్మగిల్లఁజేసి లోని కంగుళి జొన్పి సులభంబు దెలియబఱచి
వెస మేహనముమీది ముసుగు ముందటికటు బోద్రోచి జొనిపినముసుగుప్రక్క
లాని వెన్కకు రాగ నది ముందుకు బోవ కెవ్వున నొప్పిచే కేకవేయ


గీ.

కదలకుండగ బట్టి యో కలికి! యింక నొప్పిలేదని యభయంబు జెప్పి చెప్పి
కలిసి యభ్యాస పఱచిన కౌశలంబు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పచ్చిపఠాన రూపము దాల్చి కైసేసి తెచ్చిన వెలలేని తేజ నెక్కి
బాజి భావా వుడాన్ వరుస నడువంగచేపి చెలికాండ్లు చేరి “యౌరశాబాస”
నంగ నే స్వారి బోవగా నొక్కయువతి దా కిటికీల నుండి చూచి
కడుమోహమున నాదుకడ కిపు డేతెంచి యొకమాట విని బోవు టొప్పు ననుచు
కబురు పంపిన నేను వేడ్కబోయిన పైబడి కౌగిట బట్టి నిలిచి
క్రీడ గావించి ముద్దాడి బాళినిగొని దృష్టి నాకునొ యంచు తిరుగు సెలవొ


గీ.

వంగి "యల దాని వీథికి జనగ నింక వలదుసామి నాయొద్దకే వచ్చుచుండు"
మనుచు జవ్వని ప్ర్రార్థించినట్టి నెనరు మదిదలంప బ్రహ్మానంద మదియెకాదె.


సీ.

పరగ హిందుస్థాని దిరుసువేసుక జరీతాజూ ధరించి ఝోకా జెలంగ
చాలుగా నాల్గు తేజీల బూన్చిన రథమెక్కి నా చెలికాని యెదుర నుంచు
కొని రాత్రిచేసిన పనులన్నియు జెప్పుకొనుచు నేరా హర్మ్య మొనర నెక్కి
కనుగొని యొకతన్వి కళ చెళుక్కున లోనకలకబాఱి చెమర్ప నిలువలేక
తొడలు కంపము నొంద నుడుకుచు రాత్రికి తనవంతు గాకయుండినను మమత


గీ.

నిలుపగా జాల నేడె రావలయు నందు బాలకునిచేత నొకచీటి బంపిపిలువ
నంపి ననుగూడి గ్రీడించినట్టి సొంపు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

నెఱజాణతో గూడి సురతాంతమున నిల్పి కౌగిట నదిమి నే కళను విడువ
నది చూచి యిదియేమి యాతురం బని నాకు కడు వేగ నుద్ధతి గలుగజేసి