తాము వలస రావడం ప్రారంభించిన కొత్తలో భూములకు వారు పెద్ద పెద్ద ధరల్ని పెట్టసాగారు. దీనికి ఆశపడి ఆరబ్బు భూస్వాములు తమ భూముల్ని చక చక అమ్మివెయ్యనారంభించారు. ఇందుమూలంగా అంతకుముందు ఆ భూముల్ని కట్టుబడి చేసుకు బ్రతుకుతున్న చిన్న చిన్నరైతు కుటుంబాలకు — దాదాపు ఆరువేల కుటుంబాలకు — జీవనాధారం పడిపోయింది.
కట్టుబడిదారులు మట్టికొట్టుకుపోయినా, పెద్ద ఆసాములు మాత్రం యూదుల రాకవల్ల తమ భూములకు ధర పెరిగిందని చంక లెగరవేశారు. అయితే, త్వరలోనే వారికి కనువిప్పు అయింది. దేశంలో కొంత స్థావరం చిక్కగానే యూదీయులు ఒక్కమాట అనుకుని, భూముల ధరల్ని చప్పగా పడగొట్టించారు. దానితో పెద్ద ఆసాములకు కూడా దుస్థితి పట్టింది.
రైతులకూడు పడగొట్టినట్టే యూదు జాతివారు కూలీల కడుపు కూడా కొట్టారు. చౌకగా దొరుకుతున్నారు గదా అని ముందు రోజులలో వారు ఆరబ్బు కూలీలనే పనికి పిలిచారు. కాని, తమ జాతివారు తగినంత మంది వలసకు రాగానే ఎక్కువ కూలీనైనా పెట్టి వారిచేతనే పనిచేయించుకోసాగారు.
అయితే, యూదులలో కొందరు చౌకగా వస్తున్నారు గదా అని ఆశపడి, ఆరబ్బు కూలీలను పిలవడం మానలేదు. అలాటి సందర్భాలలో జియోనిస్టు సంఘాల వారు పికెటింగ్ చేయించారు. ఈ పికెటింగ్ అనేక చోట్ల సంఘర్షణలకు కూడా కారణమైంది.
ఇక, ప్రభుత్వోద్యోగాలలో, వర్తక వ్యాపారాలలో, ప్రతి ముఖ్య స్థానాన్ని యూదీయులు ఆక్రమించి వేసుకోవడమే!
దీన్ని అంతటిన్ని చూడగా, పాలస్తీనాలో నుంచి ఆరబ్బుల్ని తరిమివేసి, దేశాన్ని పూర్తిగా తామే భుక్తం చేసుకుందామా అని యూదీయులు కుట్రపన్నుతున్నట్టు కనబడింది. ఇది ఉత్తి భయం కాదు. పాలస్తీనా జియొనిస్టు కమీషన్ అధ్యక్షుడైన డాక్టర్ ఎడర్ ఈ విషయాన్ని తెగవేసి చెప్పాడు. అతడి మాటలివి.
"పాలస్తీనాలో ఒకే జాతీయ కేంద్రం ఉండాలి. అది యూదు జాతీయ కేంద్రం. యూదీయులు, ఆరబ్బులు సమాన భాగస్వాములనడానికి వీలులేదు. యూదీయుల జనాభా తగినంత హెచ్చుగానే వారిదే పై చెయ్యిగా ఉండాలి".
చూచి పొమ్మంటే దెయ్యమై పట్టుకున్నట్టున్నది — చూచి పొమ్మనకుండానే వచ్చిన — యూదీయుల ప్రవర్తన!
13
ఒక వైపున బ్రిటీష్ వారు, ఇంకోవైపున బ్రిటీష్ వారి అండతో యూదీయులు తమకు చేస్తున్న ఘోరాన్యాయాల్ని ప్రతిఘటించడానికి స్వదేశాభిమాన పూరితులైన ఆరబ్బులు మొదటి నుంచీ కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వారి ఈ ఆందోళన కారణంగా అనేక పర్యాయాలు