సూయజ్కాల్వ రక్షణకు ఈజిప్టుపై పెత్తనం ఎంత అవసరమో, పాలస్తీనాపై ఆధిపత్యం కూడా అంత అవసరం.
తూర్పు మెడిటరేనియన్‌లో బ్రిటీష్ నౌకాశక్తి అకుంఠితంగా ఉండాలంటే, హైఫాను గుప్పిటిలో పెట్టుకోవాలి.
బ్రిటన్‌కు కావలసిన పెట్రోల్ విశేషంగా ఇరాక్‌లోని మోసుల్ నుంచి వస్తుంది. మోసుల్ గనులలో నుంచి తీసిన పెట్రోల్‌ను ఎగుమతి కోసం మెడిటరేనియన్ సముద్ర తీరానికి చేర్చడానికి సిరియా ఎడారుల గుండా హైఫా వరకు గొట్టాల్ని (పైప్ లైన్) వేశారు. పాలస్తీనా మీద ఆధిపత్యం లేకపోతే ఇరాక్ పెట్రోల్ సప్లయి విషయంలో చిక్కులు ఏర్పడుతాయి.
బ్రిటన్ నుంచి ఆసియాకూ, ఆఫ్రికాకూ వెళ్ళే విమానాలకు కావలసిన వైమానికాశ్రయాల్ని కట్టుకోడానికి పాలస్తీనా చక్కగా ఉపకరిస్తుంది.
ఈ విధంగా బ్రిటీష్ సామ్రాజ్య రక్షణకు పాలస్తీనా ఎంతైనా అవసరం. ఈ విషయాన్ని స్పష్టంగా అంగీకరిస్తూ ఇటీవలనే (1936 జూన్) యామెరీ అనే ఆయన కామన్సు సభలో ఇలా ఉపన్యసించాడు:
"అది (పాలస్తీనా) ఈ దేశానికీ, ఆఫ్రికాకూ, ఆసియాకూ మధ్య ఉన్న వైమానిక మార్గాలకు క్లాప్హామ్ జంక్షన్. మెడిటరేనియన్‌లో ఏర్పడ్డ కొత్త పరిస్థితుల్ని బట్టి (ఇది ఇటలీ విజృంభణను మనస్సులో పెట్టుకుని అన్నమాట) సూయజ్ కాల్వ రక్షణ విషయంలో దాని ప్రాముఖ్యత అపారం. మాండేట్ షరతుల ప్రకారం పాలస్తీనాలో మనం యుద్ధ నౌకాశ్రయాల్ని నిర్మించుకోడానికి వీలులేని మాట నిజం. కాని, మెడిటరేనియన్‌లోని పెద్ద ఓడరేవులలో ఒకదానిగా గాని, పారిశ్రామిక కేంద్రాలలో ఒకదానిగా గాని హైఫాను వృద్ధి పరిస్తే, యుద్ధ సమయాలలో ఇతరచోట్ల నుంచి మనం తెప్పించుకోలేని వస్తువుల్ని సప్లయ్ చెయ్యడానికి అది ఎంతైనా ఉపకరిస్తుంది."
8
పాలస్తీనాను యూదు జాతీయ కేంద్రంగా చేస్తానని బ్రిటన్ రహస్యంగా వాగ్దానం చేసిందేగాని, బహిరంగ ప్రకటన చెయ్యలేదు. రహస్యంగా చేసిన వాగ్దానాన్ని కాదంటే, మళ్ళీ నోరెత్తడానికైనా వీలుండదు. అంచేత, బహిరంగ ప్రకటన చెయ్యవలసిందిగా బ్రిటీష్ ప్రభుత్వాన్ని డాక్టర్ వైజ్మన్ మొదలైన యూదు నాయకులు ఒత్తిడి పెట్టారు. సరిగా ఈ సమయంలో అమెరికాలోని యూదీయుల సదభిప్రాయాన్ని సంపాయించుకోవడం బ్రిటన్‌కు అవసరంగా కూడా కనబడింది. అంచేత 1917 నవబర్‌లో బ్రిటీష్ ప్రభుత్వం తరఫున బాల్ఫర్ (విదేశాంగ మంత్రి) ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ముఖ్య భాగం ఇది: