పుట:పల్నాటి చరిత్ర.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు


పల్నాటినిగూర్చిన హృద్యములగు శ్రీనాధునిపద్యములును వీరరసవంతమగు పల్నాటివీరుల కధయు వినుటకింపుగా నుండును. పల్నాటిలోని వనేకప్రదేశముల నేనుచూచితిని. ఇందు పేర్కొనబడిన శాసనములలో కొన్నిటిని చూచితిని. కొన్నిటిని సూయల్ దొర వ్రాసిన గ్రంధమునుండి గ్రహించి తిని. మెకంజీదొర (Gordon mackenzie) 1888 లో వ్రాసిన కృష్ణాడిస్టక్టు మాన్యుయల్ లోని పల్నాటిలోని పురాతనవస్తువులు (Antiquities of Palnad TQ) యనునది యిందలి చరిత్రభాగమును వ్రాయుటకు కొంతవఱకు సహా యము చేసెను. చిలుకూరి వీరభద్రరావుగారు వ్రాసిన యాంధ్రుల చరిత్రము, శ్రీనాధుడు రచించి అక్కిరాజు ఉమాకాంతముగా రచ్చొత్తించిన వీరచరిత్ర వీరుల కథాభాగము వ్రాయుటకు సహాయపడినవి. నాగార్జునకొండ, నందికొండ విషయమై యనేకులు పత్రికలలో ప్రకటించియుండిరి. పెందోట విషయమై విపులముగా కొందూరి వీరరాఘవాచార్యులుగారు భారతి 1951 ఏప్రియల్ నెలలోప్రకటించిరి. నాగార్జునకొండచరిత్రను కరపత్రముల ముద్రించి వాని మూలమున ననేక పర్యాయములు ప్రకటించియుంటిని, అవిగాక భక్తి యోగ ప్రదర్శినియను మాసపత్రికలో 1934 డిశంబరు, 1935 జనవరి నెలలలోను భారతి 1938 జూన్ మాససంచికలోను, తెలుగు లారిపోర్టరులో 15-3-45 నను, ఆంధ్రప్రభ 1945 సం వత్సరము (తేదీ జ్ఞాపకము లేదు) ప్రకటించితిని. ఇందలిచారిత్రక