పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

పద్మపురాణము


వ.

ఇట్లు వచ్చిన వృక్షకాంగన నతిగౌరవంబునం గనుంగొని యయోని
సంభవయగు నమ్మత్తకాశినికిం దిలోత్తమ యను నామం బిడి
బృందారకసుందరీసందోహంబునం దెల్ల నధికంబగు విభవవిల
సనంబునం బ్రసిద్ధవై విహరించుచుండు మని యత్తన్వి మెత్తన
నొడఁబఱచి యిట్లనియె.

10


క.

సుందోపసుందదైత్యులు
బృందారకగణమునెల్లఁ బీడించెద రీ
వం దఱిగి వారి నిరువుర
మ్రందింపుము నీవిలాసమాధుర్యములన్.

11


ఆ.

అనిన నమ్మహాత్ముఁ గని తిలోత్తమ పల్కెఁ
జిన్నిమోము వింతచెన్నుమీఱ
నకట! యాఁడుదాన! నసురవీరులమీఁద
నన్నుఁ బనుపఁదగునె నలినగర్భ!

12


వ.

అనిన విని నలువ దరహసితవదనుండై యయ్యింతి కిట్లనియె.
నద్దైత్యులు బలపరాక్రమసంపన్నులు గావున నెవ్వరికి నజేయు
లగుదురు. అట్లైనను నీ వల్లన నచ్చటికిం జనునప్పుడు నీసౌందర్య
విలాసంబులం జూచి మదనాతురులై తమలోనం గఱకఱిపడి
యన్యోన్యప్రహారంబులం బంచత్వంబు నొందెదరు. ఇంతట నీ
కనాయాసంబున లోకోపకారంబు సంభవించు. దేవహితంబగు ని
వ్విధంబు సేయు మనిన వల్లె యని సరసిజాసను [1]ననుజ్ఞ వడసి
తిలోత్తమ నిజాంగరాగపరిమళమిళితమలయానిలుండు [2]ముంగ
లిగా నవనీతలంబునకు డిగ్గిరా నర్మదాతటంబున నసురవరులున్న
యశోకవనంబు డగ్గఱి.

13
  1. వీడ్కొని (ము)
  2. ముందరిగా వచ్చు చందంబున నొక్కతియ నర్మదా....(హై)