పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ప్రథమాశ్వాసము

21

దిలీపమహారాజు వేఁటకై వనంబున కరుగుట :

వ.

దేవరకు నిది మృగయా వినోదావసరం బయి యున్నయది
కన్నులపండువుగాఁ జూడ వేడుకగలదేని విజయం చేయుమని
పలికిన నవ్వేఁటకాని మాటలకు దరహసితవదనుండై కొలువు
వారల వీడ్కొల్పి తగినసహాయులం గూర్చుకొని వేఁటరివిధం
బున నాయితంబై.

93


ఉ.

నెట్టన [1]బంచెఁ గౌఁ దొడిగి నెక్కొనఁ జెన్నగు పాగ మౌళిపైఁ
జుట్టి సితాసి దానిబడి సూటిగ నమ్ములు విండ్లు పూని యో
రట్టల చెప్పులుం దొడిగి యత్తెముఁ జర్మముఁ దాల్చి ద్రిండు వే
కట్టి దిలీపుఁ డొప్పెఁ గఱకంఠుఁడు లుబ్ధకుఁడైన కైవడిన్.

94


వ.

ఇవ్విధంబున మృగయాసన్నాహంబునం బురంబు వెల్వడి
యమేయసారమేయంబులును ననేకవాగురావలులును నానా
యుధహస్తులగు భటులును దోడఁ జనుదేర సింహవిక్రముం
డగుచు రాజసింహుండు నానామృగవినోదంబులు చూచుచు ననేక
నదు లుత్తరించి గాంధారవనంబు నందు.

95


సీ.

చటులతరాకారశార్దూలనికరంబు
       నడఁగించె నొక్కట నంపగముల
భీకరసూకరానేకయూధంబుల
       భంజించె నీఁటెలఁ బడలు పడఁగ
శాతశృంగోత్తుంగసారంగచయములఁ
       జటులతఁ దునుమాడె శస్త్రనిహతి
ఘోరసముద్దండసైరిభవ్రజముల
       బహువిధాయుధముల భంగపఱిచె

  1. పట్టుగౌ పచ్చగౌ (తి)