పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35

"నారద వసిష్ఠ పరాశర బాదరాయణ భృగ్వాంగిరస గురు శుక్ర మతానుసారంబై దేవ మానవ రాక్షసంబులగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషాకోవిదులగు సుకవీంద్రరచితంబైన ముద్రామాత్య పంచతంత్రీ బద్దె భూపాల చాణక్య ధౌమ్య విదుర ధృతరాష్ట్ర బలభద్ర కామందక గజాంకుశ నీతిసార నీతిభూషణ క్షేమేంద్ర భోజరాజ విభూషణ పురుషార్థసార భారత రామాయణాది మహాకావ్యంబు పురాణేతిహాసంబులు కందనామాత్యు నీతితారావళి లోకోక్తి చాటు ప్రబంధంబుల యందును గల నీతివిశేషంబు లూహించి తత్తత్సారాంశంబు లయ్యైవిధంబుల వర్గసంగతంబుగా సకలనీతిసమ్మతం బను పేర నొక్కప్రబంధంబు రచియింపుదు నని ప్రబంధసారంబునకు నే పురుషునిం బ్రార్థింతునో యని వితర్కించి" కేశవదేవుని ఎన్నుకున్నాడు. లోకోపకారార్థం తాను తలపెట్టిన సంకలనగ్రంథం గూర్చి ఈ విధంగా చెప్పినాడు.

సీ.

ఆలోలకల్లోలమగు దుగ్ధనిధిఁ ద్రచ్చి
        దేవామృతము తేటదేర్చు పగిది
గంధకారుఁడు మున్నుగల వస్తువులు జోకఁ
        గూర్చి సుగంధంబు గూడినట్లు
అడవిపువ్వుల తేనెలన్నియు మధుపాళి
       యిట్టలంబుగ జున్నువెట్టు భంగిఁ
దన నేర్పు మెఱసి వర్తకుఁడు ముత్తెము లీడు
       గూర్చి హారంబు తాఁ గ్రుచ్చు కరణిఁ


గీ.

గృతులు మును చెప్పినట్టి సత్కృతులు ద్రవ్వి
కాంచుకంటెను వొకచోటఁ గానఁబడఁగ
సకలనయశాస్త్రమతములు సంగ్రహించి
గ్రంథ మొనరింతు లోకోపకారముగను.

(I-14)


క.

కడవెఁడుదుగ్ధము లోపల
దొడిఁ బడఁ గొణిదెండు సల్ల తోడంబడిన
ట్లెడనెడ నొక్కొకపద్యం
బడరించి మదీయకావ్యమని వ్రాయింతున్.

(I-16)