పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21


ధనదారాదికే నౄణాం కస్మింశ్చిదపి వస్తుని,
స్వాయత్తతా మతిర్నాభూ ద్భువి తస్యాం మహాపది.

26


పేయా సురా గోపిశితం చ భోజ్యం లీలావిహారో ద్విజఘాతనం చ
అశ్రాంతమాసీ ద్యవనాధమానాం కథం ను జీవేద్భువి జీవలోకః.

27


ఇత్థం తైర్యవసభటైః ప్రబాధ్యమానం
త్రైలింగం ధరణీతలం సురారికల్పైః,
త్రాతారం కమపి హృదాప్యవిందమానం
సంతేపే వనమివ దావవహ్నిజుష్టమ్.

28

ఇట్టి కష్టస్థితినుండి త్రిలింగదేశాన్ని ముసునూరి ప్రోలయ కాపయ నాయకసోదరులు ఉద్ధరించినారు. కాపయనాయకుడు ఓరుగల్లుకు ఏలికై వివిధప్రాంతాల్లో తనప్రతినిధులను నియోగించాడు. గోదావరీప్రాంతములకు తన పినతండ్రి కుమారుడు తొయ్యేటి అనపోతనాయకుని పాలకుడుగా నియమించినాడు. సబ్బిసాయిర మండలం (నేటి కరీంనగరం ప్రాంతం) లోని రామగిరికి ముప్పభూపాలుని ప్రతినిధిగా నియమించినాడు. రామగిరి గోదావరీదక్షిణతీరాన కరీంనగరానికి 50 మైళ్ళదూరంలో ఉన్నది. వనవాసకాలంలో శ్రీరాము డీగిరిపై నివాసం చేశాడని ప్రతీతి. రామగిరి దుర్గంపైన ఇప్పటికీ దాని పురావైభవచిహ్నాలు కొన్ని మిగిలి ఉన్నవి. శ్రావణమాసంలో శ్రీరామోత్సవాలు జరుగుతాయి. ఈ గిరిదుర్గానికి ఐదు పెద్దద్వారాలు అనేకబురుజులు ఉన్నవి. దుర్గంమధ్యలో రాజప్రాసాదం ఉన్నది. (తురకలవశమై పోయిన తరువాత ఓరుగల్లును సుల్తాన్‌పూర్‌గా మార్చినట్లే రామగిరిని బేగంపేటగా మార్చినారు) రామగిరి పాలకునివద్ద మడికి సింగన ఆస్థానకవి. ఈతడు రాజమహేంద్రవరం తొయ్యేటి అనపోతనాయకుని మంత్రియైన అయ్యలమంత్రి పుత్రుడు. ఈ మడికి సింగనయే తెలుగు పద్మపురాణోత్తరఖండ కృతికర్త. రామగిరి దుర్గాధీశుడైన ముప్పభూపాలుని మంత్రి మొలగూరు కందనమంత్రి కృతిభర్త.