శ్లో. | సదా౽భినవశబ్దాది భరతాచార్య నామకం | |
శ్లో. | శ్రీ షత్కృష్ణ నరేశ్వరస్య కృపయా స్వర్ణాంచితాం పాలకీం | |
శ్లో. | స్వామినా కృష్ణరాయేణ సంసారానంద చిత్తవాన్ | |
శ్లో. | సంగీతాగమ లక్ష్య లక్ష్మ నిపుణై శ్రీవిష్ణు భట్టారకైః | |
గద్య. | ఇతి శ్రీమద్విప్రకులధుర్య భండారు విఠ్ఠలేశ్వరనందన, సూక్ష్మ | |
పై శ్లోకములవలన బ్రసిద్ధములగు శ్రీకృష్ణదేవరాయల యౌవనారంభమునుండి ప్రవృత్తములైన, శివనసముద్ర విజయము, ఉదయగిరి కొండవీడు కొండపల్లి విజయములు, పొట్టునూరున జయస్తంభప్రతిష్ఠాపనము, గజపతి విజయమును, గొబ్బూరు రాచూరు విజయములు మున్నగునవే కాక, ఈ లక్ష్మమంత్రి రాయల కృపాక్షీరాబ్ధికిఁ జంద్రుఁ డనియును, నాట్యసంగీతముల నప్రతిమానుఁ డనియును, దత్ప్రతిపాదకములగు ననేకగ్రంథములను రచించి, నాఁటి విద్వత్కవులచేతను సంగీతవిద్యాధికులచేతను మిగులఁ బ్రశంసింపఁబడినవాఁ డనియును, దన విద్యాప్రాభవమువలన, ననన్యసాధారణమగు “అభినవభరతాచార్య"బిరుదమును వహించినవాఁ డనియును దెలియుచున్నది.
ఇంతియకాక కృష్ణదేవరాయలవలన, బంగారుపాలకియును, శతమౌక్తికస్తబకాలంకృతములగు రెండు మౌక్తికచ్ఛత్రములను, మదగజము