పుట:పంచతంత్రి (భానుకవి).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కరునిఁ గళంకమట్లు నధికంబుగ దుర్దశ లుర్విలోన స
త్పురుషులఁ బొందుచుండుఁ దమ పూర్వకృతంబగు పాతకమ్మునన్.

—భానయ

చ.

లలితపటీరపాదపములన్ జిలువల్ గమలోజ్జ్వలజ్జల
స్థలముల గ్రాహముల్ గుణుల చక్కిఁ బరప్రతికూల దుర్జనుల్
పొలుచు నిధాన జాతముల భూతములుం గమనీయ మాక్షికా
వళి సరఘల్, సుఖంబులకు వారని విఘ్నము లేర్పడుంగదా!

—వేంకటనాథుఁడు

చ.

మలయజశీతలమ్ములగు మాటలఁ దేల్చును వచ్చినంతఁ బెం
పలవడ లేవఁ జూచును బ్రియమ్ము లొనర్చును లేతనవ్వు వె
న్నెలలు ముఖేందునం దమర నిష్ఠురదంభము మానసమ్మునన్
దలముగఁ బొల్చు దుర్జనుఁడు ధాత్రితలమ్మున లక్ష్మధీమణీ!

—భానయ

మ.

పురతఃప్రాంజలి, సాశ్రుదృగ్జలజుఁ డుత్ఫల్లాస్యుఁ డాశ్లేషణా
చరణారంభణకేళి సత్ప్రియకథాసంప్రశ్న దత్తాధికా
దరుఁడు, న్మాయి బహిర్మహామధురుఁ డంతర్గూఢహాలాహలుం
డరుదే! దుర్జనుఁ డెంత శిక్షితుఁ డపూర్వాఖర్వనాట్యౌచితిన్.

—వేంకటనాథుఁడు

ఈ యుదాహరణములవలనఁ దుల్యవిషయములపై జాలువాఱిన యీ మువ్వురు కవుల వాణీమార్గములలోని భేదములును దేటపడుచున్నవి. సరళమధురవిధురగమనములగు నీ మూఁడు కవితాప్రవాహములును నేకవిషయమున సంగమించి, గంభీరమగు నీతిశాస్త్రతీర్థమునఁ దెనుఁగుప్రజకు సులభావగాహసౌఖ్యమును బ్రసాదించినవి.

ఈమువ్వురు కవులును మూలములోని కథల నన్నింటిని యథాతథముగఁ గైకొని తెనిఁగించినవారు కారు. పెక్కు కథలను విడిచిరి. కొన్ని కథలను మూలభిన్నముగ నిర్వహించిరి. ఏయే కథలను విడిచిరో, ఏయే కథల నిర్వహణమునందు భిన్నమార్గముల నవలంబించిరో, యిచ్చట నిరూపించుట కవకాశము