పుట:నీతి రత్నాకరము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

నీతిరత్నాకరము

వారలకు గవ్వలు కూర్చిన హార ముండును. అది కుంకుమపంకలిప్తముగనుండును.

అట్టి మహారాష్ట్ర దేశమున నొక పుణ్యనదీపరిసరమున విలాసథామ మనునగరము గలదు. నదీతటమున నదికట్టఁబడుటచే బ్రవాహసమయమున బాధకలిగినను దక్కుఁగలకాలములయందు సుఖసమృద్దికిఁ గొదువలేకుండెను. కావున నా నగరము సుఖధామ మనుప్రఖ్యాతిని గాంచెను. నగర మతివిశాలభూభాగము నాక్రమించి యుండెను. గృహములు క్రిక్కిఱిసియుండక యెడముగలిగి ప్రాకారవేష్టితము లై యుండెను. కావున నారోగ్య భాగ్యమునకుఁ గొదువ లేదనవచ్చును. గృహచతుర్బాగముల గ్రిక్కిరిసి వృక్షము లుండవలయునని రాజశాసనము.కావున శీతలచ్చాయా ద్రుమములు విశేషించి యుండెను. ఎండ వేడిమి విశేషించి సోకకయుండ నాద్రుమములు కాపాడుచుండఁగా నిఁక వాసయోగ్యము కాదనుట యెట్లు ! పురము నలుప్రక్కలనుండు భూభాగము తగ్గుగా నుండెను. నగరము గలభూభాగ మున్నతము. కావున ముఱికి నీరు నిలువక పోవుచుండఁగా నెంతయో యారోగ్యముగా నుండెను.

సౌధ పంక్తులు చక్కఁగాఁ దీర్చికట్టిన ట్లుండెను. వీధులు విశాలములు. రెండు ప్రక్కలను జాలుగ ఛాయాద్రుమములు గలవు. వానిమూలముల నరుఁగులు వేయఁబడి యుండెను. బాటసారు లందుఁ గూరుచుండి యలసట తీర్చుకొనుచుందురు. కొత్తవా రానగరమును జూడవత్తురు, ఆనందయాత్ర యని దానిపేరు. ఆ పేరు మిగులఁ బ్రఖ్యాతి వహించెను, ఏటేట వేసవి