పుట:నీతి రత్నాకరము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

మొదటి వీచిక


కాయాత్ర దూరదేశాగతజనులచే సాగింపఁబడును. ఆనగరమును జూచి యందుఁ బనది దినములుండి యా శీతలమారుతమును సేవించి కృతకృత్యులై మరలి పోవుచుందురు. కన్నులు భగవంతుఁడొసంగినందులకు ఫల మానగరమును జూచుటయే యని యెల్లవారనుచుందురు. యాత్రార్థులకుఁ గొన్నియిండ్లు నిర్మింపఁబడి యుండును. గృహభృతి యించుకంతయేగాని వృద్ధి చేయరాదని రాజశాసనము కలదు. కావున బాటసారుల కేమాత్రము కష్టము కలుగ నవకాశము లేదు. కావుననే యానందయాత్ర యను పేరు సార్థకమయ్యెను.

ఆ దేశమేలు భూజాని కరుణాకరుఁ డని ధరాత్ముఁ డని విఖ్యాతినొందెను. ఆవిఖ్యాతికిఁ గారణము న్యాయ పరిపాలనమే గాని వేఱొకటి కాదు. ప్రజలు రాజును భగవంతునిగా భావించు చుండిరి. కావున నే యారాజ్యము శాంతకి సంస్థాసమయి యుండెను. అపరాధములకు శాసనములు గలవుగాని వాని నుపయోగించునవసరము లేకుండెను.న్యాయాధికారులనీ, కారాగృహాధికారు లని కొందఱుండిరి . కాని వారికి నెప్పుడో యొకప్పుడు తప్ప దక్కినపుడు కాలము పుచ్చునుపానము లేక పురాణములం జదువుకొనుచుండిరి. ఆ విలాసథామమున వీధికొక్క పుస్తక భాండాగారము నెలకొల్పఁబడి యుండెను సకలగ్రంథము లందు దొరకుటంబట్టి యవకాశము దొరకినపుడెల్ల జనులచటికింబోయి చదువుచుండిరి. అందందు నాటకశాలలు గలవు. అవి పౌరజన సంతృప్తి నొనరించుటపొందనే ఱ్పరుపబడినవే ఇట్టి వెన్నియో జనోపకారములుగ నిర్మింపఁబడినందునే యా నగరము వాసయోగ్య మయ్యెను.