పుట:నీతి రత్నాకరము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీః

నీతిరత్నాకరము

-: ఇష్ట దేవతా ప్రార్థనము.:-


చ.

సిరియని గౌరియంచు సమ సీరు దాసంభవురాణియంచు ని
ర్జరులు మునీంద్రు "లెల్లప్పుడు సన్నుతి చేయుచుఁ గొల్వ దిక్పతుల్
నిరతము పాదపద్మముల , నెమ్మి శిరంబుల: దాల్ప నాద్యయై
పరశివయుక్తి భక్తజన పాతిని బాఁదగు దేవిఁ గొల్చెదన్.


చ.

 తెలియనివారి కెప్పగిదిఁ+ దేటగ నీతులఁ దెల్ప వచ్చు న
ప్పలుకుల దెల్పకున్న నగు బాటగుఁ గానఁ గథావిధాన మే
సులలిత మార్గ మప్పనికిఁ జొప్పడియుండునటంచు నెంచి నేఁ
దెలిపెదఁ దద్విధంబును ,సుధీవరసమ్మత మాతెఱంగునన్ .


మొదటి వీచిక.

ఆరోగ్యభాగ్యముల నిచ్చుపదార్థములయందెల్ల నదులగ్రస్థానము నాక్రమింపఁ దగినవి. పూర్వలు దానిని బరమపావనములని, సేవింపఁదగినవని, సకల పాపముల నడంచునని తెలిపి యున్న వారు. జలములు భూమిని బవిత్రముగాఁ జేయునని,