పుట:నీతి రత్నాకరము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూశమున విశదీకరించిన మహాకాళీ బలివలన సంతృప్తినొంది " భక్తులకు వరములొసంగు నన్న ప్రపాదము సత్యేతర మనియ నశాస్త్ర, మనియు స్పష్టపఱిచితిని. విశేషించి దేవతోత్సవము లందుఁ జేరు జనులు భక్తిభావముగల వారు కొలఁది సంఖ్యాకులే' యని తేటపఱచితిని, మూలికలయం దద్భుతశక్తి కలదని తెలియఁ బలికితిని. ఇట్టి విషయములు బాలుర హృదయముల నిలుప వలయు ననియు, దాన సనాత నీతిమార్గము పెంపొందు ననియు, విశేషించి దేవతాభక్తియుఁ బ్రభుభక్తియుఁ గుదురు కొన నవకాశము కలుగుననియు నాయాశయము. తక్కినవిషయములు గ్రంథపఠనమున నే తెలియఁగలను. ఇక్కడ వ్రాయ నవసరము లేదు,

ఈపొత్తమును ముద్రింప గోరఁగనే యంగీకరించి మూడుదినములలో ముద్రించియిచ్చిన యాంధ్ర గ్రంథోద్ధారకులు మ.రా. శ్రీ వావిళ్ల వేంక టేశ్వరశాస్త్రులుగారికీ మూలమున నాకృతజ్ఞతం దెలుపుచున్నాఁడను. కథాసంవిధానమున నెన్నియో లోపములుండును వానినెల్ల నాచే సంస్కరింపఁ జేయభాషాభిమానుల నంజలీ ఘటించి వేఁడుచున్నాఁడను, ఇంకఁ బెంచి వ్రాయ నుద్యమింపక సజ్జనులను దీనికిఁ జేయూత యొసంగ వేడుచు విరమించుచున్నాఁడను.

ఇట్లు సుజన సేవకుడు,

జనమంచి శేషాద్రిశర్మ,

శ్రీ. శ్రీ. శ్రీ.