పుట:నీతి రత్నాకరము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఆఱవ వీచిక. 109 స్కరించి వారియనుమతినొంది యభినయమున కారంభించుచు,

శ్లో. *[1] దేవః సాయాత్సయసివిమలే యాము నేమజ్జతీనాం
యాచంతీ నామనునయపదైరంచి తాన్యంశుకాని,
లజ్జాలో లైరలసవిల సైరున్మి షత్పంచబాణై
ర్గోపస్త్రీణాం నయనకుసు మైరర్చితః కేశవోనః.”

అను శ్రీకృష్ణకర్ణామృతశ్లోకమును బఠించెను. దానిని విని, నంతన సభ్యులు సంసారముల మఱచి శ్రీకృష్ణ ధ్యానతత్పరు లైరి అంత నా కాంతావతంసము తదర్ధమును జెప్పకుండ నేత్రములను హస్తములను గదలించుచు విధినతిక్ర మింపక దానఁ గలభావ మెల్లఁ గనఁబఱచెను. “నయనకుసుమైః" అనుపదము నభినయించునపుడు సభ్యులయాశ్చర్యము వర్ణనాతీతమయి యుండెను. అభినయానంతర మాయిందుముఖి భక్తిభావము నెల్లరుం గొనియాడిరి. ఆ రేయి భుక్త్యనంతరము హరికథ సాగెను రుక్మి ణీకల్యాణకథను దెలుపుచు నా దాసునెల్లర విస్మిత. చిత్తులనుగా నొనరించెను. ఈరీతిగా నాయాయి వినోదముల నైదుదినములు సుఖముగా గడచెను.

విద్వత్కవి ప్రభృతుల నుచితరీతి సమ్మానించి శ్రీనివాస దాసు పాత్రాపాత్ర వివేకముగలవాఁ డనుఖ్యాతికిం బాత్రుఁ డయ్యేను. తదనంతరము జాలంధర పురమునకు గృహ ప్రవేశ

  1. * "యమునా వేణికయంచు గోపికలు నీరాడ స్వకీయాంశుకా ఘముల జ్" దాఁచఁగ సిగ్గుచే మృదులవాక్య ప్రౌఢితో వేడుకర్, సముదంచన్మ చనాలసోల్లననిరీక్షా నీలనీ రేజమా ల్యములక్ వారలు పూజచేయఁదగునయ్యబ్జాక్షు సేవించెదన్ .”