పుట:నీతి రత్నాకరము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

నీతిరత్నాకరము

మనుకార్యమున కెల్లరు దయచేయవలయునని శ్రీవత్సాంకదాసు ప్రార్ధింప బంధుహిత పండితాదు లెల్లరు నచ్చటికిఁ బయనము సాగించిరి. వచ్చునపు డెట్టియుపచారముల మార్గమున శ్రీనివాసదాసేర్పఱచి యుండెనో యట్టి యుపచారములు చేయ శ్రీవత్సాంకదాసు మఱుపయనమున నేర్పాటుచేసెను. వీసమంతయు నావిషయమున భేదము గానరాక యుండెను. కతిపయ ప్రయాణముల జాలంధరపురమును బ్రవేశించి శుభముహూర్తమున గృహప్రవేశ శుభకార్యమును జరపించిరి. మూఁడుదినము లందెల్లవారు నుండిరి. ఎల్లర నాదాసు సుచిత విధుల బహూకరించెను. ఎల్లరుఁ బరమసంతుష్టమానసులై తమతమ గ్రామములకు వారి కీర్తియశస్సులం బొగడుచుఁ బోయిరి. అల్లునిం గూఁతును బిలుచుకొని శ్రీనివాసదాసు విలాసధామమున కరుదెంచెను. కొన్ని దినములుండి శ్రీకృష్ణదాసు ధర్మపత్నిం దోడుకొని తండ్రియానతిమెయి నిజపురమున కరిగెను. ఈ రెండువంశము లాదంపతులపై నాధారపడి యున్నందున గొంతకాలము జలంధరపురమునను గొంతకాలము విలాసధామమునను వా రుభయులు నివసించుచుఁ దల్లిదండ్రులకు నత్తమాములకు మహోత్సవమును గలిగించుచు రాధికా శ్రీకృష్ణదాసులు పరోపకార తత్పరులై న్యాయార్జితవిత్తులై సుజనరంజనులై శాంతభూషణులై యన్యోన్యానురాగము వర్దిల్ల వర్తిల్లుచుండిరి. రాధిక యక్కాలపుఁ బురంద్రీమణుల కుదాహరణభూతయై విద్యావినయముల విఖ్యాతింగాంచి సహధర్మచారిణి యను పేరు సార్థకమగునట్లు ప్రవర్తించుచుండెను. శ్రీకృష్ణదాసు