పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ పరవస్తు చిన్నయసూరి

కర్తః భాషోద్ధారక శ్రీవావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులు గారు

ఆంగ్లమునుండి అనువాదకులు: వాకాటి పెంచలరెడ్డి

సుప్రసిద్ధ సమకాలికులగు శ్రీకందుకూరి వీరేశలింగముపంతులు, మహామహోపాధ్యాయ శ్రీకొక్కొండ వేంకటరత్నముపంతులు, హైందవ వేదాంతోన్నత పాఠశాల సంస్థాపకులగు శ్రీ ఆర్. శివశంకర పాండ్యాజీలు శ్రీ పరవస్తు చిన్నయసూరిని ననుపమాధునికాంధ్రగద్యనిర్మాతగఁ బరిగణించిరి. శ్రీసూరి తనజీవితమున గౌరవనీయులగు శ్రీ గాజుల లక్ష్మీనరసింహులుశెట్టిగారు, సి. యస్. ఐ. మున్నగు మహనీయులప్రాపకమును బొందెను. శ్రీ చిన్నయసూరి రచనలన్నియు లభ్యము గాకుండుట మన దురదృష్టము. "హిందూచట్టము" ప్రచురణలో శ్రీసూరి, జాక్. డి. మెయెన్ గారికి దోహద మొసంగిరఁట; కాని శ్రీసూరి స్వయముగ వ్రాసిన గద్య నేఁ డలభ్యము. 1858 లో నయ్యది గ్రంథరూపము దాల్చినట్లు తెలిసికొంటిని. సూరిరచనలు బ్రిటిషు వస్తుప్రదర్శనశాల (మ్యూజియమ్) లో నున్నట్లు విద్వాంసులవలన దెలిసికొంటిని.

“తత్త్వబోధిని పత్రిక” ననుసరించి శ్రీసూరి 1866 లో మద్రాసు పాఠ్యపుస్తక నిర్ణయసంఘము, భాషాసమితి - అనువానికి నధ్యక్షుఁడుగ నిర్ణీతుఁడయ్యెను. ఆంధ్ర, మద్రాసు విశ్వకళాపరిషత్తువారి సౌజన్యమున పరిశోధకులు శ్రీసూరి రచనలఁ బరిశోధించి, ప్రచురించుటకు సావకాశము మెండుగాఁ గలదు. ఆంధ్రమున స్వయముగ వీరు నిఘంటువును గూర్చిరి. అతిరమ్య‘మైన వారిస్వహస్తలిఖితాక్షరములఁ గాంచు భాగ్యము నాకు లభించెను. నిఘంటు వసంపూర్ణముగ నిలిచిపోవుట మన యభా