పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీతిచంద్రిక

మంగళము

ఉ.

శ్రీ యనుమించుమిం చొలయ సేవకచాతకలోకమోదసం
ధాయకుఁ డై యుదారకరుణారసవృష్టి దురాపతాపముల్
వాయఁగఁ జేయుచున్ సకలవాంఛితసస్యము లుల్లసిల్లఁగాఁ
జేయుచు వేంకటాద్రి నివసించుఘనుం డిడుఁగాత భద్రముల్.


క.

కరుణ తెఱంగున హరియెద
నిరవుకొని యఘాళి నరయనీక యతనిచే
నిరతము సంశ్రితజనులం
బరిరక్షింపించుతల్లి భజియింతు మదిన్.


చ.

వనజభవాండభాండము
లవారిగ నెవ్వనితుందకందరం
బున నొకమేలనింటరముఁ బొందక పొందుగఁ బొల్చు నమ్మహా
త్మునినిజభోగశయ్య నిడికపొత్తులకందువునట్లు లాలనం
బొనరుచు నయ్యనంతు మహిమోన్నతు సన్నుతియింతు నిచ్చలున్.

ఆదికవిస్తుతి

క.

ఘను నన్నయభట్టును ది
క్కన నేఱాప్రెగడఁ బొగడి యలికంబున య