పుట:నీతిచంద్రిక (పూర్వార్ధము).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధుండయి మరలి యిరవున కరిగి యనుతాపపరీతమానసుం డగుచు డాయవచ్చిన కరటకదమనకులం జూచి యిట్లనియె.

'కటకటా! ఎంతదారుణకర్మంబు గావించితిని. భరణరక్షణంబులం బ్రకృతిరంజనంబు గావించువానికిం జెల్లుం గాని నాకు రాజనామంబు గాల్పనే! దూరము విచారింపక సంజీవకునిఁ జంపుకొంటిని. విషవృక్ష మేని సంవర్ధించి తాన ఛేదింపఁజనదు. ఎఱిఁగియే నెఱుఁగకే నేరమి యొక్కండు వొనరించినభృత్యుని నయంబు భయంబుఁ జూపి వాని వేఁడుకోలునం దెలవంబడిన ట్లభినయించి తొలుత మిన్నక విడువవలయు. ఆవల మఱి కావించిన వాని నిజాధికారంబువలనఁ దలంగవలయు. ఇంతకు హెచ్చుఁదీండ్రంబు గానిపింపంబోలదు. కానిపించినం దక్కుంగల లెంకకూటవు కాయువుం దొఱంగు. దాన ఱేనికి దొసంగు పొసంగు నిందు సంశయంబు లేదు. ఎట్టికడిందికర్ణంబయిన సాధింపవచ్చుఁగాని తగినభృత్యుని గడియించుట సుకరంబుగాదు. అది యట్లుండనిమ్ము. లోకంబునందుఁ గలకాలము దుర్వారంబయిన దుర్యశంబు దెచ్చుకొంటి. ఇంక నేమి చేయుదు' ననిన మిన్నక క్రిందుచూచుచుండె. అంత దమనకుం డిట్లనియె. 'స్వామి! దాయం బరిమార్చి యివ్వడువున సుమ్మలంపడంబోలదు. ఱేఁడు తను నెరగుపఱుపం గడంగువానినేని నొప్పరికింపక దోరింపవలయునని పాడినెఱి నెఱిఁగినగఱువలు పలుకుదురు. నేరమిం బొనరించినవారియం దోరిమి తాపసులకుంగాని భూపాలురకుం జనదు. రాజ్యలోభంబువలనం గాని హంకారంబువలనంగాని స్వామిపదంబుం గోరువానికి వధంబు దక్క దండంబు లేదు. ఈయర్థంబు సర్వసమ్మతంబు' నా విని పింగళకుండు సంతుష్టుండయి భద్రాసనంబు నధిష్టించె.