పుట:నారాయణీయము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29


పశ్యామి" "కనుచున్నా నదిగో” అని యా నారాయణుని దివ్యరూపమును కేశాది సఖావధిగా వర్ణించిన వర్ణన మపూర్వము. అందు భక్తిచేతను, రచనా రామణీయకముచేతను నా వర్ణనము పరకోటి కెక్కినది. త్రిలోకసమ్మోహనమగు నా పరమేశ్వరుని మంగళరూపమును జక్షుస్సుచే (అనిన నేఁటివారు నమ్మరేమో) జ్ఞానచక్షుస్సుచేతను వీక్షింపకున్న ననితర సాధ్యమగు నట్టిఫక్కిలో భట్టపాదుఁడు రచింపఁగలఁడా ? "తత్సర్వం తపసా సాధ్య"మ్మనియు, "తపసా దుష్కరం నా స్తి" యనియుఁ బల్కిన యార్షవాక్యము లసత్యము లగునా ? అసత్యములని ధార్ష్ట్యమునఁ బలికినచో నంతకంటె ఘోరమని యుండునా ?

ఆతఁడొనర్చిన కవిత్వతపస్సు తుట్టతుదికిఁ బండినదన్నమాట. అట్టి పరిపక్వ తపశ్శక్తికి భగవంతుఁడు పాదసేవకుఁడయి తీరవలసి దే. తనకు బ్రత్యక్షముగా లేడు. కనుక నమ్మమనువారి కొక నమస్కృతి జేసి, భగవత్స్వరూపపర్ణన ఘట్టము పరిశీలింతము.

"కనుచున్నా నదిగో కలాయసుమరేఖా కోమలమ్మైన వె
 ల్గును బీయూషరసాప్లుతుండనయి యాలో దివ్యకై శోర మూ
 ర్తిని శ్రీ నారదముఖ్యు లయ్యుపనిషచ్ఛ్రీసుందరీబృందముల్
 వినుత బ్రహ్మసుఖానుభూతిఁ బులకల్ నిండారు నెమ్మేనుల౯
 దనచుట్టు౯ గొలుప౯ జెలంగు నుదయత్తారుణ్యలావణ్యుని౯".

అదిగో కలాయమువలె గోమలము నీలమునగు తేజఃపుంజమును, దానిలోపల నారదాది పరమర్షులును. ఉపనిషత్కాంతలును బ్రహ్మానుసంధాన జనితానందానుభవముచే గగుర్పాటొందిన శరీరములతోఁ డన్నుఁ జుట్టుకొని సేవింప దీపించు నంకురత్తారుణ్యలావణ్యమగు దివ్యకిశోర విగ్రహమును (బాలకృష్ణుని) కనుచున్నాను. అని భావమున పొంగిపోవుచున్నాఁడు. ఆ లేఁ బ్రాయపు వెలుఁగును నిదానించి చూడఁగా

"ఘననీలప్రభ నుంగరాల్ దిరిగి, చక్క౯ జిక్కువోదువ్వి నిం
 చిన యక్కొండెసిగ౯ గనన్నవమణీ శ్రీమత్కిరీటమ్ము, సం
 తనగాఁ జెర్విన నెమ్మిపించియము మందారస్రగాబద్ధ మై
 యనువౌ నీక బరీభరమ్ము మతి నీదౌ ఫాలబాలేందు వీ
 ధిని దర్శించుచు నుంటి శ్వేతతర తత్స్నిగ్ధోర్ధ్వపుండ్రద్యుతి౯"