పుట:నారాయణీయము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28


రాలో కదా! అంతలో 'ఆఁగె గానము, వాద్యము నాఁగె' - ఆ యంగనలు బ్రహ్మానంద రసానుభూతిలో మైమఱచి నాట్యముచేసి రే కాని ఎడలు నీవినిగాని, విరియు వేణినిగాని, ప్రిదులు రైకను గాని యా వేగమునం దెఱుఁగనే యెఱుఁగరఁట. ఇంతకంటెను చిత్రము. సకలదిశలనలమిన వెలుఁగును నాఁగిపోయెనఁట. ఇట్లు మదనోన్మాదలగు నా సుందరుల పురాకృత సుకృతమున నందఱ కన్ని రూపులఁ దాల్చి వారిని, మాన్మథోత్సవమునఁ దేల్చెనఁట. ఆ కేళీస్వరూపము తరువాతి పద్యమున నిట్లు వర్ణింపఁబడెను.

“వింతకేళి మురిపించి ముచ్చటలు వించి లాలనము నించి నీ
 వంత యామునవనాంత కేళుల లతాంత సౌరభ నితాంత శ
 య్యాంతపాళుల వనాంతలీలల సుహాసినీ రత ఏ మోహన
 మ్మెంతొ సేసితి నొకించుకై విసరి యించు చల్లనగు తెమ్మెర౯."

ఆహా ! ఇందు. భావమెంత మృదువో రచన మంతకంటె మృదుతరమే కాదు. మధురతరమును-కవిత్వమున కింతకంటె సాఫల్య మేమి కలదు ? "

ఈ ఘట్టమున శృంగారము పిక్కటిల్లియున్నట్లు లౌకికదృష్టికిఁ గనఁబడును గాని పరమార్థ మారయ - భగవదనుగ్రహము మాత్రమే యని విశదమగును. భగవంతునకు జగత్తంతయు శరీరమనియు, నందేక దేశములగు నా యువతుల యాలింగనాదికము స్వాంగాలింగనమే యనియు, అందు కామ ప్రసక్తి లేదనియుఁ బురాణాంతరమునఁ జెప్పిన

"స్వాంగాలింగే రతి ర్న స్యా : దంగనాలింగనే రతిః
 యస్యాంగం జగ దీశస్య, తస్య రాగాదయః కుతః"

అను సూక్తికి స్ఫోరకముగా 'సకలదిశల నలముకొనిన వెలుఁగు' అను వాక్యమును జక్క రచించిన యీ రచయిత సంస్తుత్యుఁడు. త్రికరణశుద్ధిగాఁ దన్ను భజించువారిని దనయందుఁ జేర్చుకొనువాఁడు భగవంతుఁ డనుటకు నీ ఘట్టము ముఖ్యోదాహరణము. పరంజ్యోతిస్స్వరూపుఁడగు శ్రీకృష్ణపరమాత్మ యా కన్యల కంతర్బహిర్వర్తియై, యానందక్రీడన మొనరించినాఁడను సర్ధము కాంతా సమ్మితముగాఁ దెలుపఁబడినదని కావ్యమర్మజ్ఞులు గ్రహింపకపోరు.

ఇఁక నీ స్తోత్ర కావ్యమున తుట్టతుదిని శ్రీ నారాయణభట్టపాదుఁడు బ్రహ్మానందసాగరమున నోలలాడుచుఁ దన కఠినతపోనియమయుక్త ధ్యానమునకు వశంవదుఁడై ముకుందుఁడు తనమ్రోల సాక్షాత్కరించినట్లు "అగ్రే