పుట:నారాయణీయము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27


కతె కొక్కొకఁడుగాఁ గృష్ణభగవానుఁడు విశ్వవ్యాపన విలాసము మెఱయించును. 'నాట్యమునఁ బయ్యెదలేకుండ కంచుళీ (కంచెల) మాత్రమే నటిదాల్చు' నను సంప్రదాయము చక్కఁగా నిముడ్చుట రుచిరము.

తరువాతి పద్యమున ఆకాశమున నిల్చి దేవత లరయుట మనోహరముగా వర్ణింపఁబడినది.

అనంతరపద్యమున . "ఇత్థ మాకల్పితే మండలే మధ్యగః సంజగౌ వేణునా దేవకీనందన"యనినట్లు మండలమధ్యమున నిలిచి పరమాత్మ వేణువు నూఁదుచుండ "పిల్లగ్రోవి వినిపించు తానసమ వేద గానకల రాగలీలోల్లసద్గతుల" కనువుగా "ఉచ్చలత్పదపయోజతాళలయ భంగిమ"లచే మణికంకణాళి ఘల్లు మనుచుండ, నొండొరుల మూపులందు కరకంజము లానుకొని శ్రోణిచలదంబర లగుచు గోపాంగనలు ఝణంఝణఝణలను నెఱపి రనిన వర్ణనము ఎంత మనోహరము! ఎంత స్వాభావికము!

అనంతర పద్యమున - తారస్వరమున వెలువడు గానమున కనువగు తాళముతోడి గోపికాకృష్ణుల లాస్యతాండవములఁ గాంచి ముగ్ధుడై దేవతలు పూల వానలు నించిరి. సచ్చిదానందమయుఁడగు భగవంతునిలో లీనమైపోయి మూర్ఛిల్లిరి అని వర్ణింపఁబడెను, మనస్సుచే నూహించుట కేని యలవికాని యా జగన్మోహనదృశ్యమును గాంచి దేవతలేకాదు. ఏ ప్రాణి యానందరసాప్లావితమై మూర్ఛవోవదు ?

ఈ క్రింది పద్యమున నొక విచ్ఛిత్తి విశేషము రసప్లుతమై కనఁబడును. ఒక తీవబోణి, మెయితీఁగను గ్రొంజెమట గలుగ శ్రమచే సోలుచు, కనులు మూతవడఁగా కృష్ణుని కేలూని నిల్చియుండఁగా ప్రక్కనున్న యొక గోపిక యా యవకాశము కనిపెట్టి, కృష్ణుని పటీరరస నిస్సృతితోఁగూడిన భుజము నల్ల నఁ జేరి యాతని మోవి ముద్దుగొని పులకితగాత్రి యయ్యెనని వర్ణింపఁబడెను. ఈ ఘట్టమున కంతకు నిది రత్నదీపమనిన నతిశయోక్తి కా నేరదు. భగవానుని యెడఁగల గోపికల ప్రేమ మెంత మధురమో ! ఎంత నిరవధిక మోకదా !

క్రమముగా రాసము హ్రాసము నొందుట ననంతరపద్యద్వయమున వర్ణింపఁబడెను.

ఒక కాంత కర్ణాభరణములు చెదరిపోయిన తన చెక్కును కృష్ణుని చెక్కున నాని తదాస్యపూగరసచర్వితము నాస్వాదించె నఁట. ఎంత పుణ్యాత్ము