పుట:నారాయణీయము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11


అని మూలమునందలి తాత్పర్యము చెడకుండఁ బరిచితమగు సంస్కృత పదములతోఁ బూరించి, మూలమున లేకున్నను "ముద్దియ పాంథులపాపమెట్టెదో" అను వాక్యముచే వెనుకటి యుద్ధమున కంతకును అనిర్వచనీయశోభ చేకూర్చెను. అట్లే యందును 'అఖండ దయారస మూలకందమున్‌' అను విశేషణముచే గురుపవనపురదేపుఁడు ధ్వనించుట రమ్యము. వీరి యనువాదపద్ధతి యట్లే నడచినదని తెలియఁదగును.

సన కాదులు వైకుంఠమున జయవిజయులను శపించిరి. క్షమించిరి. తన గృహద్వారమున జరుగుచున్న యా యలజడికి హరి లక్ష్మితో వెలుపలికి వచ్చు సందర్భమున

'తదేత దాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహి రంబుజాక్ష!
 ఖగేశ్వరాంసార్పితచారుబాహు ఆనందయం స్తా నభిరామమూర్త్యా!'

అను మూలమున 'ఆ సంగతి తెలిసి నీవు లక్ష్మితోవెడలి, చక్కని రూపముచే మునుల నలరించుచు గరుడుని మూపున సుందరహస్తమునుమోపి వెలుపలికి వచ్చితివి' అని యుండఁగా

"ఏలినవారి కల్లరి యదెల్ల వినంబడఁ బోలు, లచ్చితో
 మూలదివాణముం గదలి మోసల నిల్చి ఖగేంద్రు మూపుపైఁ
కేలిడి వాలుగా నిలిచి కిమ్మనకుండనె విశ్వమోహనా
లోల కటాక్ష వీక్షణములోనన లోఁగొనినావు వారలన్."

అని భక్తిరసము తొనంకునట్లు తెలిఁగించుట మెచ్చఁ దగినది. పూజ్యార్థకమగు భవచ్ఛబ్దమునకు 'ఏలినవారు' అని ప్రయోగించుట, 'మీరు, తమరు' అను పదముల కంటెను బరమ విధేయతను సూచించుచున్నది. 'అవాప్తః సహైవ లక్ష్మ్యా బహి రంబు జాక్ష' అనుదానికి 'లచ్చితో మూలదివాణమున్ గదలి మోసల నిల్చి' అని తెనిఁగించుటలో మూలమున లేని 'మూల దివాణముం గదలి' యని భగవంతుని ప్రాభవము వెల్లడించుచు 'బహి రవాప్తః' (వెలుపలికి వచ్చితివి) అను దానిలోని బహిఃపదమునకు బదులుగా మోసల యని తెనిఁగించి, విష్ణుని కోటయొక్క స్వరూపము ధ్వనింపఁజేసెను. 'ముఖశాలా' పదమునకు మొగసాపా, మోసాల, మోసల' యను పదములు తద్భవము లగుటచే ముఖశాలతోఁగూడిన కోట, కోటలోపలి సౌధపంక్తి, అందు శుద్ధాంతసౌధము మదికి స్ఫురించి యొక యద్భుత దృశ్యము గోచరింపకమానదు. ఇట్టి వ్యంగ్యమే 'యలిరామ మూర్త్యా'