పుట:నారాయణీయము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


ఈ కావ్యము పై లక్షణమునకు లక్ష్య మెట్లయినదో తెలిసికొనుట ముఖ్యమే కదా! 'నారాయణీయము' అను నీ స్తోత్రగ్రంథమున విషయ మంతయు శ్రీమద్భాగవత గాథామయమే యగుట యెవని మనంబునకుఁ బ్రియముగాదు ? ధర్మార్థ కామమోక్షములను జక్కఁగ నుపదేశించు నీ కృతి ‘పథ్యము' అని వేఱు చెప్పుటేల ! దిగ్దేశ కాలాతీత పరంజ్యోతి యగు శ్రీ నారాయణుని చరిత్రములు 'తథ్యము' లన సందియమెందులకు ? పతితపావనములగు నా కథలు 'అమోఘము” లనఁ బునరుక్తి కాదా? అపరిమితములగు భాగవత గాథ లన్నియు స్తోత్రరూపమున భక్తిజ్ఞాన వై రాగ్యముల కాటపట్టై, పదేసి పదేసి పద్యములలోఁ జక్కగ నిముడుకొని యీ కావ్యమునఁ బరిమితము లే యైనవి. మధురములగునా ? కాదా ? యను వితర్కము కుతర్కమగును. ఆమూలాగ్రము పరిపుష్టమైన యా మధుర తాగుణమును బరీక్షించుట యనావశ్యకము కాదా? "మధురం మధురం వపురస్య విభో-ర్మధురం మధురం వచనం మధురం మధుగంధి మృదుస్మిత మేత దహో, మధురం మధురం మధురం మధురం' అని లీలాశుకుఁ డొందిన మధురానుభూతి కృష్ణ చరితామృతములోని మాధురికి సాక్షి.

మఱియు నాలంకారిక శేఖరుఁ డగు రూపగోస్వామి తన ఉజ్జ్వల నీలమణి' యను లక్షణ గ్రంథమున 'రసముల కన్నిటికి భక్తిరసము రాజు అనియు, దాని కాలంబన విభావములు శ్రీకృష్ణ పరమాత్మ యుఁ దదీయవల్లభలు నగుదు రనియు . శాంత ప్రేయో వత్సలోజ్జ్వల భేదములచే నాభక్తి యే వైవిధ్య మొందు ననియు, అందు ఉజ్జ్వలభక్తి యే మధురభక్తి యను పేరఁ బ్రసిద్ధి కెక్కెననియు సోపపత్తికముగా విపులముగాఁ జర్చించుచు - “ముఖ్యరసేషు పురా యః సంక్షేపేణాదితో రహస్యత్వాత్, పృథగేవ భక్తి రసరాట్ సవిస్తరేణోచ్యతే మధురః," అనియు "వక్ష్యమాణై ర్విభావా ద్యైః స్వాద్యతాం మధురా రతిః, నీతా భక్తి రసః ప్రోక్తో మధురాఖ్యో మనీషి.భిః" అనియు తత్స్వరూపము నిరూ పించెను. “అస్మి న్నాలంబనాః ప్రోక్తాః కృష్ణ స్తస్యచ వల్లభా!" అని యా మధురభక్తికిఁ గృష్ణుఁడును, అతని ప్రియురాండ్రును ఆలంబనవిభావము అనుటచే నారాయణీయమున ప్రతిపదమును బ్రతికథయును మధురభక్తిమయమై మధురాతిమధుర మనకతప్పదు. "ఆకృతి యస్మదీయమధురాంధ్రవచఃశ్రుతి మేళివించి" అని వ్రాసికొనఁ గల్గిన దీక్షితకవి వచస్సు మధురమని వాచ్యమగుచుండ వివరణ మక్కరలేదు గదా! మధురమగునది యాంధ్రభాష