పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 2

నారసింహపురాణము. ఆ-3

117


గీ.

అసురనందను దోఃప్రతాపాగ్నిశిఖల, వెట్ట కోర్వఁగఁ జాలక [1]తొట్టగిలుచు
నపరవారిధిజలమగ్నుఁ డయ్యె ననఁగ, నస్తమించె దివాకరుం డంతలోన.

171


క.

హరిణాక్షీనయనద్యుతి, హరిమణిదళదుత్పలప్రియంభావుకభా
స్వరనైల్యగుణము లన్నియుఁ, బరువడి సురమార్గమహిమఁ బాటింపంగన్.

172


క.

మాసినయద్దంబులక్రియ, గాసిల్లెన్ హరిదిభేంద్రకటభాగంబుల్
వాసి వదలి నలువయు సం, త్రాపంబున బుద్ధి గలఁగి తహతహనొందెన్.

173


క.

మొక మడిచినఁ గానఁగలే, కొకవస్తువు నిట్టి దనఁగ నోడిరి లోకుల్
శకలితహరిహయమణికో, రకములలో నణఁగి రనఁగ రాత్రిటివేళన్.

174


సీ.

హేషారవంబులు నెఱుఁగంగ దగుఁగాని తురగరూపంబులు తోఁపవయ్యె
విపులఘీంకారము ల్విని తొలంగుటె కాని తెలియంగరావయ్యెఁ గలభఘటలు
చక్రనేమీరవ[2]ప్రక్రమంబునె కాని తిలకింపరాదయ్యెఁ [3]దేరిపిండు
స్వరమున భటునిపే రరయుమాత్రమె కాని దర్శనస్పర్శనస్థైర్య ముడిగె
దృష్టిగోచర మెల్ల నదృష్ట మయ్యె, మిన్ను మున్నును గోవెలవన్నె యయ్యె
గరవటమునిండ నించినకజ్జలంబు, కరణిఁ జీఁకటి బ్రహాండఘటము నిండె.

175


క.

ఆపంబినతిమిరంబుప్ర, తాపంబున సకలభువనదర్శన మాఁగన్
దీపస్తంభము లెత్తిరి, యాపటమండపములందు నసురేంద్రభటుల్.

176


సీ.

కరచపేటంబుల గాడాంధకారసింధురకుంభములు వ్రచ్చి విరియఁ జేసి
తారకామిషమునఁ దనౌక్తికంబులు పలుదిక్కులందునఁ బాఱఁజల్లి
కాఱు తద్దేహరక్తముచాయ నవసాంధ్యరాగవిలాసంబుఁ బ్రోగుచేసి
తద్వధదోషంబు తగిలెనో యన మేన మృగచిహ్నగరిమంబుఁ దగులుకొలిపి
నిగిడె గర్పూరపన్నీరనీర, హారనీహారహారిచంద్రాతపములు
వసుమతీచక్ర మఖిలంబు వాడుఁ దేర్పఁ, గైరవప్రియబింబప్రకాశమహిమ.

177


క.

ఈకరణిఁ జంద్రికాపరి, పాకము లోకముల కెల్లఁ బరమానందో
త్సేకంబు సేయ దానవ, లోకాధీశ్వరుఁడు మిత్రులును దా నలరెన్.

178


వ.

ఆసమయంబున సూచీముఖశూర్పకర్ణవికటధూమ్రాక్షకపిలాక్షులు మొదలై
కదలక యేప్రొద్దుం దన్నుం గొలిచి యున్న యన్నిర్జరారులం గనుంగొని
ప్రహ్లాదుం డి ట్లనియె.

179


ఉ.

ముందఱికార్య మిద్ది మనముం జతురంగబలాన్వితంబుగా
నిందుల కేగుదెంచితి ముదీర్ణులు మీరలు కర్ణధారు లై

  1. తొట్రగిలుచు
  2. ప్రక్రమంబ్బయ్యె
  3. తేరుమిండు