పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 1

నారసింహపురాణము. ఆ 1

37


పక్రమమీనధామగృహపాలనిజధ్వజినీమహాపుర
శ్శుక్రము నిర్గళజ్జ్వలనశోషితనక్రము నాత్మచక్రమున్.

192


క.

తలఁచిన నిలిచె సుదర్శన, మలఘుసుదర్శనము సజ్జనానందంబుం
దలకొలుప నరిప్రభయము,[1] నెలకొలుపఁగ నృహరికేల నిర్బరలీలన్.

193


వ.

ఇట్లు శరభనృసింహులు సంహారరుద్రాకారులై జగదుపప్లవకారణం బగు
మహారణంబునకు నుపక్రమించి శూలచక్రంబు లెత్తుటయు మొగులుమొ
త్తంబులు నెత్తురులు గురిసె ధరణి విరిసె గిరులు వడంకె సముద్రంబు లివు
రంబాఱె మహాకూర్మంబు బిలంబుఁ దూరె నరనాగసురాసురగరుడగంధర్వ
సిద్ధసాధ్యు [2]లసాధ్యం బగుమనస్తాపంబునం దపించిరి భూతప్రపంచంబు
కుంచితసంచారం బయ్యె నంత.

194

బ్రహ్మ హరిహరులయుద్ధము మాన్పవచ్చి స్తుతించుట

సీ.

హస్తాబ్దముననున్న యక్షమాలిక వోవ వైచి మ్రోలను నున్న వాణి మఱచి
హరిపాదతీర్థపూరాభిపూరిత మైన పద్మరాగపుగిండి పగుల నడిచి
నలునంక మొగములఁ దలచూపు చెమటల మంచునేత్రంబుల ముంచుకొనఁగఁ
గీలుగంటూడిన లోలజటచ్ఛటావళి యొకకేలనె బలిమిఁ దుఱిమి
కోపమోకాక యావేశగుణమొకాక, గ్రహము సోఁకెనొకాక యీద్రుహిణునకును
ననుచు జనములు బెగడంగ నంచతేజి, రౌతు కాల్నడ వచ్చె నుద్భూతభీతి[3].

195


క.

సమరము సేయుచు ఘూర్ణిలు, నమరేంద్రుల నడుమ నిలిచి యాగమసూక్త
క్రమమున నుతియించు వచో, రమణీరమణుండు చతురరచనారభటిన్.

196


సీ.

జయ పుండరీకాక్ష జయ ప్రమథాధ్యక్ష జయ రమాతరుణీశ జయ యుమేశ
జయ యోగిగణసాధ్య జయ సజ్జనారాధ్య జయ జైత్రగుణజాల జయ సుశీల
జయ భక్తమందార జయ ధవళాకార జయ కవిస్తుతిపాత్ర జయ పవిత్ర
జయ సముజ్జ్వలవేష జయ తిరస్కృతదోష జయ మేఘసంకాశ జయ మహేశ
జయ సువర్ణపటావృతస్థపుటజఘన, జయ మృగాదనచర్మసంఛాదనఘన
జయ గదాపాంచజన్యాసిచక్రహస్త, జయ త్రిశూలాదిశస్త్రరాజప్రశస్త.

197


చ.

జయ ఫణిరాజతల్ప జయ సర్వజగన్నుత కౌస్తుభాంకితా
జయ నరసింహరూప జయ శాశ్వత వార్ధతనూభవాధిపా
జయ రజతాద్రిగేహ జయ శంబరశాత్రవభూతిభూషితా
జయ శరభావతార జయ శంకర శైలసుతామనోహరా.

198
  1. గరిప్రభయము. మూ
  2. లసాధ్యంబులగు. మూ
  3. నుద్భూతభూతి. మూ