పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 5-6

నారసింహవురాణము. ఆ - 5

327

ప్రహ్లాదునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమగుట

గీ.

అనుచు దానవకులసింహ మపుడు తోఁక
నీరుమోచి గజేంద్రుని గౌరవమున
శార్ఙ్గి గురియించి ఘోషించుసమయమున ము
రారి ప్రత్యక్షమయ్యె నయ్యనఘమతికి.

85


వ.

ఇట్లు సాక్షాత్కరించి యప్పుండరీకాక్షుండు పక్షీపరివృఢధృఢస్కంధారూఢుం
డై రోహణశిఖరిశిఖరావలంబి నీలాంబుదంబుచందంబున ననల్పసౌందర్య
మందిరుం డై యిందిరాదేవి పొలయలుకలకలకలం గలంగి యందంద వం
దనం బాచరింపం దదీయసీమంతసిందూరరజోరంజితంబు లనం గెంజాయ
రంజిల్లు చరణపల్లవంబులును నడుగునడుగునం బొడమన మిన్నేటితేటనీటం
బర్యటనంబు సేయు పాఠీనంబులపరిపాటిం బాటిల్లు చిందంపుమీలమేని
జాలిగల పొలపంబుఁ దెలుపుచు బలభిదాదిదివిజకిరీటకోటిమాణిక్యశా
ణోత్తేజనంబున రాజిల్లు చరణనఖరశిఖరంబులును గాంతిలీలాకలాచిక లైజాను
చ్చాయాద్విగుణితశోభాభిరామంబు లై యిలేందిరాకరారవిందోపలాలన
పరిస్పంద[1]మందిరంబు లై సొంపొందుజంఘల యలంఘ్యప్రభావిభవంబును
నభిరామనాభీకమలవిమలపరాగపరంపరా[2]విహితంబులగు నివి యన ధగ
ద్ధగని చిగురుపసిండికాసియ వాసికెక్కు చక్కని యూరుప్రదేశంబును
గాంభీర్యంబున నంభోజసంభవుం డొక్కచక్కిం జిక్కి చేవమ్రాను దొలఁచు
నలికలభంబు సులభగతి నతీతానాగతంబులు చింతింప నత్యంతకాంతి
మంతం బగుచు శోభిల్లు నాభిపల్వలంబును ద్రివళీవలయవలయితంబై
గుణత్రయవిచిత్రమూర్తి యగు మాయప్రోయాలునుం బోలేం గ్రాలుచు
గగనతలవివర్తం బై సూక్ష్మేక్షణలక్షితం బగునవలగ్నంబు [3]సొగుపును నగణిత
ముక్తాదామాభిరామం బై ప్రేమాస్పదం బగుచుం గందర్పకరకంబు బిబ్బో
కంబు [4]నాగడంబు సేయు కంధరాధౌరంధర్యంబును నాజానులంబితంబులై
తేజరిల్లుచు ననర్ఘ్యమణిమయముద్రికాముద్రితాంగుళీకిసలయంబులం బస
మీఱి శోభిల్లుచు నుల్లోకలావణ్యపణ్యస్థలంబు లగు నతిస్థూలబాహా
స్థూణంబులును సపరిక్షీణజలధరశకలకలితనభోభాగంబు బాగున సంచిత
శ్రీవత్సలాంఛనం బగువత్సప్రదేశంబునుం జంద్రమండలంబు బెండుపఱిచి
ముకురంబును వికవిక నగి జిగిదమ్మియెమ్మె లడంచి యుదంచితవిలోచనపుండ

  1. మందిరంబ్బులంబ్బులై
  2. బహితంబ్బు
  3. సోగిపును
  4. నాగంబ్బుశేయు