పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


శరంబుల నురంబులు చించియుఁ బరశువులఁ బర్శుకంబులు మురియం
జేసియు నత్తళంబుల నొత్తియుఁ బ్రాసంబులం ద్రాసంబు నొందించియుఁ
జక్రంబులం జక్కుసేసియు ముసలంబులం గసిమసంగియు నొక్కఁడయ్యునుం
బెక్కురూపంబులు దాల్చి పొల్చి నిల్చినయట్లుండె. నుండుటయు.

72


శా.

ఒల్లంబోయినసేనఁ గన్గొని ఖరుం డుగ్రాస్త్రపంక్తిం దలల్
డొల్లంజేయుచు యక్షరాడ్బలము [1]బిట్టుంజందము న్మాన్చి చే
విల్లాఖండలచాపలీల వెలుఁగ న్విత్తేశ్వరుం డాసి క్రో
ధోల్లాసంబున నార్చుచుం బలుకు విద్యుద్భీమదంష్ట్రాస్యుఁ డై.

73


ఉ.

కోమటిబింక మేమిటికి ఘోరపరాక్రమ మైన రాక్షస
స్తోమముఁ గిట్టుటెల్ల నిది దోమలు సామజరాజిఁ దాఁకి సం
గ్రామము సేయుచంద మగుఁ గాదె ధనాధిప బుద్ధి గల్గిన
న్వే మగుడంగఁ బాడి యవేకమున న్నెఱిదప్పుఁ గార్యముల్.

74


గీ.

గుహ్యకేశాభిధానంబు గ్రుడ్డిగ్రవ్వఁ, బోలుపడ గ్రుడ్డు హేయమౌ పొడవు గల్గు
నీదుపోటును గలిగిన నేఁటినుండి, కలుగకుండునె జగములోఁ గప్పకాటు.

75


ఉ.

నావిని విత్తనాథుఁడును నంజుడు నెత్తురుఁ గ్రొవ్వు నాని పె
న్గావర మెత్తి పల్కెదవు కష్టనిశాచర లావు గల్గినం
బోవక పోరు న న్నెదిరి పోటునకై [2]యఱుక్రమ్మి వచ్చి యే
లా వదరంగ దుర్వచనలాలసు మెత్తురె శౌర్యవిత్తముల్.

76


క.

నీరజ్జు లణఁచి పుచ్చెద, నొరోరీ నిలువు మనుచు నుజ్ఝితగదుఁ డై
యారాక్షసు ముంచె సారా, సారంబున యక్షరాజు చాపము మెఱయన్.

77


క.

హరిచిత్రగతులు మెఱయఁగఁ, బరిపంధిరథాశ్వపంక్తి బడలువఱచి ని
ష్ఠురభల్లంబున నొక్కట, హరసఖుఁ డసురేంద్రసూతు నసువులఁ బాపెన్.

78


మ.

విరథుం డై దనుజాధినాథుఁడు మహవేగంబుతో ధారుణీ
ధరకూటంబుననుండి డిగ్గు మదవద్దంతావళారాతిభీ
కరరేఖ న్వసుధాస్థలంబునకుఁ జక్కం దాఁటి యక్షేశుబల్
తురగంబు న్నిజముష్టి నొంచుటయు నెత్తుర్గక్కి నానీతియున్.

79


క.

కనుచదరి హయము గూలిన, ధననాథుఁడు విల్లు విడిచి దారుణగదఁ గై
కొని యసురకడకు వ్రేసిన, వెనుక కొదిఁగె నతఁడు ధాతువికలత్వమునన్.

80
  1. బిట్టుం జెంద్దము (బిట్టుంజెయ్దిము?)
  2. పోటునకైయ్యరుగ్రమ్మి