పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విష్ణువును బ్రహ్మ సృష్టించి ఆ బ్రహ్మకు శ్రీమహావిష్ణువే వేదవిజ్ఞానభిక్షతోపాటు, అష్టాక్షరమంత్రోపదేశంకూడా చేయగా, ఆ అష్టాక్షరమంత్రావృత్తిప్రభావంతో సమస్తదేవతలనూ, సమస్తప్రపంచాన్ని సృష్టించాడట.

"ఏతన్మంత్రరహస్యము
స్వాతి సృజించెదవు సకలజగదంతరముల్
ఖ్యాతిగ నధికారాంతం
బేతెంచిన నన్ను నాశ్రయించెదు మీఁదన్.

సారతర పరమతంత్ర స
మారబ్ధావృత్తి పూని యబ్జభవుఁడు స
ర్వారంభోన్ముఖుఁడైతా
నారూఢస్థితిఁ బ్రపంచమంత సృజించెన్.

(నార. 98. పు. 23, 24. ప.)

'సీత అయోనిజ' అని అనేకసందర్భాలలో పెక్కుగ్రంథాలలో పేర్కొనబడినా, ఆమె యోనిజ అనడానికి సైతం చిరాక్షేపణీయమైన కథ ప్రసిద్ధమై లేకపోలేదు. అయితే మహేశ్వరుని విషయంలో మాతాపితృరహితుడని అనేకగ్రంథాలు వేనోళ్ల కీర్తించాయి. కాని తద్భిన్నంగా నారదీయపురాణంలో మహేశ్వరుడు బ్రహ్మపుత్రుడని యీ క్రిందివిధంగా పేర్కొనడం జరిగింది.

"అక్షీణశక్తిని విరూ
పాక్షుండన నొక్కపుత్రుఁ డతనికిఁ గల్గెన్
దక్షుఁడు హరిభక్తి రతుం
డక్షయవిజ్ఞానవైభవాధిక్యుండై."

అంత విధాత పురందరాది దివిజస్తుతుండై దేవదేవుండన వెలసిన తనయునకు భవోత్తారకం బుపదేశించి వేదవేదాంతంబులు చదివించిన నతం డైశ్వర్యంబు వహించి సర్వభూతంబులకు నైహికంబులు కృపసేయుచునుండ. (నార. 99. పు. 25. వ. 26. ప.)

మామూలుగా పండితపామరులంతా 'గాయత్రి' అని, 'గాయత్రీమంత్ర మని' అనుకుంటూ వుంటారు. వాస్తవానికి "తత్సవితుర్వరేణియం" ఇత్యాదిగా వున్న మంత్రం చాలామంది గాయత్రీమంత్ర మనుకుంటారు. నిజాని కిది గాయత్రీఛందంలోవున్న సవితృదేవతాత్మకమైన మంత్రమని అనేకమంది పండితులకు కూడా తెలియదని చెప్పడంలో ఆశ్చర్యకరమైన విషయ మేమీలేదు. అసలు గాయత్రీచ్ఛందం వేరు - గాయత్రీదేవతాత్మకాలైన మంత్రాలు వేరు. గాయత్రీమంత్రాలలో విష్ణు గాయత్రి, బ్రహ్మ గాయత్రి, మహేశ్వర గాయత్రి, అని మూడువిధాలైన గాయత్రు లున్నాయి. విష్ణుగాయత్రి గురించి నరసింహకవి "దీనియందు వ్యాప్య