పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తట తట స్ఫురదురోదైతేయశలభసం
         ఘాతప్రతాపనిర్భరతరంబు
కటకట దంష్ట్రాగ్రఘట్టితకహకహో
         త్తర్జన గర్జాతి దుర్జయంబు
భూరిభూషణ తీవ్రదంభోళి ఘోర
సారవారు సటాచ్ఛటా సంకులంబు
సంభ్రమాతభ్రధరణితలాభ్రతలము
వీరనరసింహరూప మావిర్భవించె."

(నార. 505. పు. 258. ప.)

విశేషాలు

నరసింహకవి గోపికావిహారవర్ణనలో "అధరామృతము జిహ్వనానుకొనిన" (నార. 29. పు. 159. ప.) అని అధరామృతపురుచి గురించి పేర్కొన్నాడు. వాస్తవానికి సంస్కృతాంధ్రాది వాఙ్మయాలలో అధరామృతాస్వాదనం గురించి వర్ణించని ప్రాచీనకావ్యాలు లేవు. నిజానికి ప్రతివ్యక్తి అధరోష్ఠంలోనూ అమృతం వుండదు. ప్రేమికులందరూ పరస్పరం యువతీయువకుల అధరోష్ఠాన్ని చీకవచ్చును. కాని వారికి తద్రూపంగా లభించేది ఉమ్ము, లేదా చొంగ, లేదా లాలాజలం వంటిదే కాని అమృతం మాత్రం కాదు. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా వాస్తవానికి ఊర్వశీ, రంభా, మేనకా ప్రభృతులు అమృతసిద్ధి పొంది మహాతపస్సంపన్నులైన మహర్షుల తపోభంగం కలిగించడానికో, లేదా వారిని సహజంగానే ప్రేమించి వారి సంభోగసుఖానుభూతిని అనుభవించడానికో వారి అధరామృతాన్ని ఆస్వాదించనీయవలసిందిగా అభ్యర్ధించేవారు. అమృతసిద్ది పొందిన వ్యక్తి లాలాజలం అత్యంతమధురంగా వుంటుంది. అందువల్ల అటువంటివారి అధరంనుంచి లభించే లాలాజలాన్ని అమృతంగా భావించేవారు. అమృతసిద్ది పొందడంవల్ల అమృతమయమై మధురాతిమధురంగా వుండే లాలాజలం అమృతం కాక మరేమవుతుంది? అయితే అమృతసిద్ధి పొందిన మహర్షివంటి వారిపట్లనే అధరామృతశబ్దాన్ని అతిప్రాచీనకాలంలో వ్యవహరించేవారు. అయితే క్రమంగా, అమృతసిద్ధి పొందనటువంటి అతిసామాన్యమానవులకు సైతం శృంగారవర్ణనలలో యీ అధరామృతశబ్దం నిరర్థకంగా ప్రయోగించడం జరిగింది.

విగ్రహారాధన అత్యంత ఆధునికకాలంలో ప్రారంభించబడిందని చాలామంది పరిశోధకులు భావించారు. వాస్తవానికి విగ్రహారాధన యెంత ప్రాచీన