పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిత్యాప్సరో౽లంకృతంబై రతిలోకంబు విరాజిల్లు తత్ప్రాచీన అనిరుద్ధలోకంబు రాణించు నుదీచిం బ్రకాశించి యానందవారధియగు నా యనిరుద్ధలోకంబునకుఁ బ్రాచియగు విదిక్కున సద్గుణసాగరంబగు శాంతిలోకంబు విజృంభించు. ఇవి చతుర్వ్యూహంబులు నాలుగు శ్రీకళలు, నాలుగును బ్రదక్షిణక్రమంబునఁ బ్రాచ్యాద్యష్టదిక్కులం బ్రకాశించు నీ వ్యూహాష్టకంబు ప్రథమావరణంబున నుండు. "మధ్యే మధ్యేత్వ సంఖ్యేయా స్తత్త ద్వ్యూహ" మ్మనిన శ్రుతివలన ననేకవ్యూహంబులు గలవు. ద్వితీయావరణంబునం బ్రాచ్యాదిదిక్కుల వరాహ జామదగ్న్య శ్రీనరసింహ రఘువల్లభ శ్రీధర వామన హయగ్రీవ వాసుదేవలోకంబులు గలవు. తదధిపతులు విభవేశ్వరులు నిత్యులు. వీరు వ్యూహాష్టవిశిష్ట శ్రీవైకుంఠేశ్వరప్రీతిసాధనంబైన బ్రహ్మవిద్య నర్వాచీనప్రాకృతభూముల నవతరించి ప్రకాశింపఁజేయుదు రీమూర్తులం గొల్చిన నపవర్గంబు లభించు. తృతీయావరణంబున నెనిమిదిదిక్కుల పాంచజన్య ముసల చక్ర ఖడ్గ గదా శార్జ్గాది వైజయంతంబులు నిలుచు. నిత్యానవధికనిరతిశయానందంబగు భగవత్సేవ గావించు. చతుర్థావరణంబును గుముద, కుముదాక్ష పుండరీక వామన శంఖర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠితులు నిత్యులు. నిత్యముక్తులతో నీశ్వరు నారాధింపుదురు. పంచమావరణంబున నింద్రానల దండధర నిరృతి యాదసాంపతి గంధవాహ ధనేశానులు నిత్యనిర్జరు లుండుదురు" (నార. 358, 359. పు. 171. వ.) దీనినిబట్టి విష్ణుమూర్తి వహించిన వివిధావతారాది లోకాలు సైతం, విభిన్నాలుగా వున్నట్లు స్పష్టమవడమేకాక, ప్రాగవాచిలో శ్రీలోకం, పశ్చిమంలో శ్రీవైకుంఠం, అంటే మహావిష్ణుస్థానం వుండగా, పంచమావరణలో ఇంద్రానలాదులస్థానం వున్నట్లు శ్రుతిప్రామాణికత్వంతో ద్యోతకమవుతున్నది. ఇదేవిధంగా అపూర్వమైన మహావిష్ణుశక్తి గురించి, వేదమంత్రప్రామాణికత్వంతో నరసింహకవి యీ క్రిందివిధంగా వర్ణించాడు. "శ్రుతియు విష్ణునకు "అపాణి పాదోజ వనోగ్రహితా పశ్యంత్యచక్షుః నశ్రుణోనకం నః సవేత్య వేద్యం నచనశ్య వేత్తా తమాహు రగ్ర్యం పురుషం మహాంతమ్ నకస్యకార్యం కరణంచ విద్యతే సతత్స మశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్యశక్తే ర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ" యనిన నది హస్తంబులులేక పట్టును. పాదంబులులేక పఱువెత్తును. చక్షువులులేక చూచును. కర్ణంబులులేక వినును. అవేద్యం బైనయది యెఱుంగును. త న్నొకం డెఱుంగలేఁడు. అతండు మహాపురుషుం డని యెంతురు. అతనికిఁ గార్యకరణంబులు లేవు. అతనికి ముందు నధికుండు లేఁడు. అతని శక్తి వివిధంబైనయదియై స్వాభావికంబులు జ్ఞానబలక్రియలు." (నార. 364. పు. 189. వ.) మహావిష్ణుమాహాత్మ్యం గురించి యెంత వర్ణించినా వొక్కమానవభాషలలోనేకాదు, దేవ