పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని దేవేంద్రునికంటే ఉపేంద్రుడైన విష్ణువు తక్కువవాడన్న అభిప్రాయం వ్యక్తీకరింపచేయడం జరిగింది. వాస్తవానికి ఉపేంద్రశబ్దానికి చిన్నయింద్రుడని అర్థం కాదు. ఇంద్రునికి సమీపంలో వుండేవాడనికూడా అర్థంకాదు. 'తన సమీపంలో ఇంద్రుడు కలవాడు' అని మాత్రమే అర్థం. "ఉపసమీపే ఇంద్రః యన్యపః ఉపేంద్రః" అని అసలైన అర్థం. ఎక్కడో కోట్లాదిమైళ్ళదూరంలో మహోన్నతస్థానంలో ఖగోళంలో నక్షత్రరూపంలో క్షీరసముద్రం (Thick Milky Way) అనబడిన పాలపుంతలో శేషశాయి అయివున్న మహావిష్ణు నక్షత్రా లెక్కడ? జ్యేష్ఠాది దేవతయైన దేవేంద్ర నక్షత్రా లెక్కడ? ఉన్నతస్థానంలోగాని, వైశాల్యంలోకాని, మహత్తరశక్తిమత్తత్వంలో విష్ణు నక్షత్రాలకు, దేవేంద్ర నక్షత్రాలకు పొంతనయే లేదు. అందువల్ల ఉపేంద్ర శబ్దానికి చిన్నయింద్రుడని కాకుండా, "తనసమీపంలో ఇంద్రుడు కలవాడు" - "ఇంద్రున కాశ్రయభూతుడైనవాడు" అని విశేషార్థాన్ని అసలైన, సిసలైన మూలార్థాన్ని చెప్పి, మహావిష్ణు స్థానానికున్న శాస్త్రీయమైన వాస్తవికతను మనం గుర్తించవలసివున్నది. కాగా దేవేంద్రుడు ఉపేంద్రునికంటే తక్కువవాడే కాని, యెక్కువవాడని చెప్పడానికి అవకాశం లేనేలేదని గ్రహించాలి. నారదీయపురాణంలో రెండు సందర్భాలలో విష్ణుపరంగా 'ప్రభువు' అనే అర్థంలో ఈశ్వరశబ్దంసైతం ప్రయోగితమయింది, "సనకాదులు శపించుట విని దయాబ్ధియు భక్తవత్సలుండును నగు నీశ్వరుండు." (నార. 421. పు. 119. వ.)

"కాన నేనును స్వప్రసిద్ధకలితసర్వ
శక్తియుక్తుండనైన యీశ్వరుఁడ నస్మ
దాజ్ఞచే లోకములకు సర్వాగమములు
నీశత వహించె నిఁక నిన్ని యెంచనేల?"

(నార. 432. పు. 172. ప.)

ఈ సందర్భాలలో ఈశ్వరుడంటే మహేశ్వరు డనికాక మహావిష్ణువని మాత్రమే అర్థం చెప్పుకోవాలి.

నారదీయపురాణంలో వైకుంఠలోకం ఆవరణపంచకాలను గురించి వేదప్రామాణికత్వంతో యీ క్రిందివిధంగా వర్ణింపబడింది. "ప్రాగవాచిని శ్రీలోకంబును బశ్చిమంబున శ్రీవైకుంఠంబునకు దక్షిణంబున నిత్యానందంబునిధియు సద్భక్తవరదుండునగు సంకర్షణవిభుం డుండు, ఆ సంకర్షణలోకంబునకుఁ బశ్చిమంబున నిర్మలానందనీరధి నిత్యంబునగు సరస్వతిలోకంబులఁ దగు ప్రత్యగవాచిని సరస్వతిలోకంబున కుత్తరంబునఁ బ్రద్యుమ్నలోకంబు చెలంగు. ప్రతీచీనయు తార్కేందుప్రభ దీపించి నిర్మలశర్మదంబై ప్రద్యుమ్నపదంబుదగ్గర రవిదిక్కున