పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రహ్లాదుడు

ప్రహ్లాదుడు అనన్యసామాన్యమైన మహావిష్ణుభక్తుడు. ఇతని తండ్రి హిరణ్యకశిపుడు. తల్లి లీలావతి. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుద్దేశించి ఘోరమైన తపస్సు చేయడానికి పూనుకొనగా దేవతలు రాక్షసులమీదకు యుద్ధానికి వెళ్లారు. ఆయుద్ధంలో రాక్షసులంతా వోడిపోయారు. అప్పుడు ఇంద్రుడు హిరణ్యకశిపుని భార్య గర్భవతియైన లీలావతిని పట్టుకొనగా నారదు డడ్డుపడి లీలావతి సచ్చరిత్ర అనీ, ఆమె గర్భంలోవున్న బాలుడు, మహావిష్ణుభక్తు డవుతాడనీ, ఆమెను చంపవద్దని చెప్పి, విడిపించి, తన ఆశ్రమానికి తీసుకొనివెళ్లి కాపాడి, పోషించి ఆమెకు ఆమె గర్భస్థుడైవున్న ప్రహ్లాదునికి మహత్తరమైన విష్ణుతత్త్వోపదేశం చేశాడు. ఈవిషయంతోపాటు మిగతావిషయాలన్నీ, భాగవతాది గ్రంథాలద్వారా విజ్ఞులకు సువిదితాలే. అయితే దేవీ భాగవత, భారత, వామనపురాణాలవల్ల మరికొన్నివిశేషాలు తెలుస్తున్నాయి. అవి ప్రహ్లాదుని జీవిత మధ్య, ఉత్తరచరిత్రలకు సంబంధించినవిగా కనిపిస్తున్నాయి.

వాటిని యీక్రింద సంగ్రహంగా ఉటంకిస్తున్నాను. ప్రహ్లాదుని అర్థాంగిపేరు దేవి. ఈ దంపతులకు ఆయుష్మంతుడు, శిబి, విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అనే అయిదుగురు పుత్రులు కలిగారు. ప్రహ్లాదు డొకసారి ఒకమునీశ్వరుణ్ని అవమానించాడు. అతని శాపం కారణంగా ప్రహ్లాదుడు విష్ణుభక్తిరహితు డైపోయాడు. అనంతరం విష్ణుమూర్తికి, ప్రహ్లాదునికి పరస్పరం యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో ప్రహ్లాదునికి శాపవిముక్తితోపాటు, తిరిగి విష్ణుభక్తి ప్రబుద్దమైనది.

ఒకసారి చ్యవనుడు స్నానంచేస్తూ వుండగా, అతనిని పాతాళలోకవాసులు, పాతాళానికి యీడ్చుకొనిపోయారు. అప్పుడు పాతాళంలోవున్న ప్రహ్లాదుడు చ్యవనుణ్ని చాలా గౌరవించాడు. అపుడు చ్యవనుడు తానుచేసిన తీర్థయాత్రలమహాత్మ్యాలనుగురించి వివరంగా వర్ణించి చెప్పగా, ప్రహ్లాదుడు చ్యవనునితోపాటు తీర్థయాత్రలు చేయడానికి సపరివారంగా వెళ్లాడు.

ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చేస్తూ, నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్లి, వారినీ, వారిసమక్షంలోవున్న వివిధ అస్త్రాలనూ చూచి "వీరు నిజంగా మునీశ్వరులే అయితే వీరికి అస్త్రాలతో పనేంవున్నది. బహుశా వీరు వంచకులై వుంటారు." అని అన్నాడు. ఆ మాటలు విన్న నరనారాయణులకు ఆగ్రహం వచ్చి వారు ప్రహ్లాదునితో యుద్ధానికి తలపడ్డారు. ఆపోరాటంలో ప్రహ్లాదు డోడిపోయి శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నరనారాయణు