పుట:నాగార్జున కొండ.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిల్పాలు

23



(12) మహాపరినిర్వాణం" : అనేక ప్రాంతాలలో అనేక వేలమందికి తన ధర్మాన్ని బోధించి తిన 80వ యేట బుద్ధుడు కుశీనగరము, రామగ్రామమూ అనే రెండు గ్రామాల సరిహద్దులో కొద్దిగా జ్వరం తగిలి పరమపదించాడు. ఆతర్వాత అతని శిష్యులు అతనిని ఒక చైత్యం రూపంలో ఆరాధించారు

జాతకకధల శిల్పాలు

బోధిసత్వుడు సిద్ధార్ధుడుగా అవతరించక పూర్వం ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో మంచిపనులు చేశాడట. ఈ పూర్వజన్మ వృత్తాంతాలకు జాతకములని పేరు ఇట్లాంటి జాతకక ధలు కొన్ని పందలు ఉన్నాయి. ఇతరచోట్ల వలెనే నాగార్జునకొండలోగల శిల్పా లలో కూడా జాతకకధలు శిల్పించబడినవి. ఇక్కడ తొమ్మిది జాతకముల శిల్పాలు కనిపిస్తాయి. ఇవి యీ క్రింద సంగ్రహంగా, వర్ణించబడుతున్నవి :

(1) ఉమ్మగజాతకం : బోధిసత్వుడు ఒకప్పుడు మహో సధుడనే పేరుతో ఒక వర్తకుడి కుమారుడుగా పుట్టాడు. చిన్న తసంలోనే మహామేధావి అని పేరు తెచ్చుకున్న ఇతనిని రాజు మంత్రిగా నియమించాడు. అదివరకే నలుగురు మంత్రులున్నారు. వీళ్ళకి మహోసధుడిమీద అసూయ కలిగింది. అతన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలని సంకల్పించి వారు నలుగురూ రాజుగారి ఇంటినుంచి కిరీటంలోని మాణిక్యమూ, కంఠాభరణము. ఉన్ని కంచుకమూ, బంగారు పాదుకలూ దొంగిలించారు. ఆతర్వాత