పుట:నాగార్జున కొండ.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

నా గార్జున కొండ


వీటిని తమ కానుకలుగా మహోసధుడి భార్య అమరకు పంపిం చారు. ఆమె భర్తను మించిన మేధావి. ఆమే ఈ వస్తువులలో దేనిని ఏమంత్రి పంపాడో ఋజువు సంపాయించి వుంచింది. ఈ మంత్రులు రాజుదగ్గరికి వెళ్ళి పోయిన వస్తువులు మహోస ధుడి యింట్లో వున్నాయని చెప్పారు. రాజు మహోసధుడిమీద మండిపడ్డాడు. దీనితో భయపడి మహోసధుడు ఊరు విడి " పారిపోయాడు. ఆమీద మంత్రులు అమరతో వినోదించాలో ఒక్కొక్కరే ఆమె యింటికి వచ్చారు. ఆమె ఒక్కొక్క........ మంత్రికే తల గొరిగించి, ఒక చాపలో చుట్టబెట్టించింది. తర్వాత ఆమె రాజుగారి వస్తువులతోటీ యీచాప చుట్టలతోటీ ఆస్థానానికి వెళ్ళి నిజం రుజువుచేసి తన భర్త నిర్దోషిత్వాన్ని స్థాపించింది.

(2) చంపెయ్యజాతకం : ఒకప్పుడు బోధిసత్వుడు చంపెయ్యుడనే నాగరాజుగా అవతరించాడు. అతడు అప్పుడప్పుడూ మనుష్యులతో కలిసి ఉపవాసాలూ, వ్రతాలు చేసేవాడు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు మంత్రం వేసి యీ నాగరాజును కట్టేసి ఆనేక విధాల అతనిని ఆడించి డబ్బు సంపాయిస్తూ వచ్చాడు. ఒకరి ..... కాశీరాజు ఎదుట ఈ ఆట జరుగుతుంది. ఇంతలో నాగరాజు భార్య అక్కడికి వచ్చి కాశీరాజుతో తన భర్త వృత్తాంతం చెప్పి అతనిని విడిపించింది.

(3) మాంధాతుజాతకం" : బోధిసత్వుడు ఒకసారి మాంధాత అనే పేర ఒక రాజుగా జన్మించి గొప్ప చక్రవర్తి ఆయాడు. ఇక్కడ అనుభవించిన సుఖం చాలక అతడు స్వర్గానికి