పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రభుత్వాల తరపున సహయం అందించేలా ఛ్హూడాలి.

“సూర్యా ఇదే మన ఇల్లు..”

'మెతానిన్‌ నవతిన్న ' క్యాబ్‌ డ్రెవర్‌తో సింహళంలో ఏదో చెప్పాడు మసన్న. కారు డిక్కీలోంచి సామానుదించాడు. కారు వాడికి అప్పటి వరకూ అయిన డబ్బు ఇచ్చేసి పంపించేశాను.

మా కారు ఆగిన శబ్దానికి ఇంటి లోపలి నుంచి ఓ నడివయసు స్త్రీ బయటకి వచ్చింది. మసన్న ఆమెతో 'మనోడే, దేశం నుంచి వచ్చినాడు అని చెప్పాడు.

“సూర్యా, నా పెండ్లాం కళావతి..” అంటూ పరిచయం చేశాడు”

“నమస్తే, వదినా” అన్నా ఆమె మొదట నన్ను చూసి కాస్త ఆశ్చర్యపోయినా ఆ తరవాత చిరునవ్వుతో ఆహ్వానించింది.

వసారాలో ఉన్న చెక్క బెంచీ మీద ఇద్దరం కూర్చున్నాం. వదిన మా ఇద్దరికీ స్టీలు గ్లాసుల్లో మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది.

చల్లగాలి వీస్తోంది. ఇక్కడ పరినరాలు చాలా స్వచ్చంగా ఉన్నాయి. కాలుష్యం ఇంకా వీళ్ల వాడను తాకలేదు.

“ఇల్లు చూపిస్తా రా సూర్యా అంటూ లోపలికి దారి తీశాడు. తన వెంటే నేనూ.

వసారాను ఆనుకుని హాలు. అది కాస్త పెద్దదే. ఓ పక్క ధాన్యం బస్తాలు... ఓ ప్లాస్టిక్‌ టేబుల్స్‌ నాలుగు కుర్చీలు వేసి ఉన్నాయి.

ఆ హాలు నుంచి నేరుగా ఉన్న తలుపులోంచి లోపలికి వెళితే పడక గది. ఓ నాలుగు పరుపులు చుట్టి ఉన్నాయి. ఆ గదిలో ఉన్న కిటీకీకి ఆనుకుని ఆరడుగుల చెక్క బల్ల వేశారు. బల్ల పక్కనే నా సామాను పెడుతూ...

“ఇదే నీ గది సూర్యా, ఎన్ని రోజులైనా నువ్వ హాయిగా ఉండొచ్చు. మా ఇల్లు చిన్నది కావచ్చు కాని మనసు కాదు” నా కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పాడు.

ఒక్కసారిగా ఆయన దగ్గరికి వెళ్లి హత్తుకున్నాను. తను సంతోషంగా నన్ను చూశాడు.

హాలులోనే ఓ వైపు వంటగది. ఇద్దరమూ హాలు మథ్యలో ఉన్న ఇంకో తలుపులోంచి బయటకి వచ్చాం. బయట అంతా చిన్నపాటి తోట. ఆనపకాయలు, కాకరకాయల తీగలు అల్లుకున్నాయి. గులాబీలు, మందారాలు విరబూశాయి. సీమకోళ్లునూ 'పెంచుతున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా ఓ షెడ్డులాంటిది చేశారు. ఓ కోడి పెట్ట తన పిల్లలతో తిరుగుతోంది. ఇంత దాకా ఎక్కడుందో కానీ వచ్చింది ఓ కుక్క తోక ఊపుతూ మసన్న దగ్గరికి వెళ్లింది. 'జాకీ అంటూ దాన్ని ముద్దు చేస్తున్నాడు. ఓ పక్క స్నానాల గది. అటు వైపే చూస్తూ..

“ ఇది ఆడొళ్ల స్నానాల గది, కాస్త దవ్వలో కాలువ ఉంది.మగాళ్లందరమూ పొద్దునే అక్కడికి వెళ్లి స్నానాలు చేసి, బట్టలు ఉతుక్కుని వస్నాం. తాగు నీళ్లు వాడకం నీళ్లు అన్నీ అక్కడి నుంచి తెచ్చుకోవలసిందే” వివరించాడు మసన్న

మామిడి చెట్టు కింద ఓ బకెట్లో నీళ్లూ మగ్గూ ఉన్నాయి. తను వెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కుని లోపలికి వెళ్లాడు.

నేనూ కాళ్లూ చేతులు కడుక్కుని ఆ చల్లగాలికి అక్కడే ఉండిపోయాను. మామిడి చెట్టంతా చిగురేసింది. అక్కడక్కడా పిందెలు వేసింది. చెట్టుకానుకుని ఉండిపోయా. ప్రవల్లికకు నాకూ ఇంకా ఎంత దూరం అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది మసన్న వాళ్ల అన్న కూతురు.

మసన్నే రెండు కప్పుల్లో టీ తీసుకుని వచ్చాడు. టీ తాగుతూ అడిగాను

“మీ అన్న వాళ్ల ఇల్లు ఎక్కడ?”

“ఈ పక్మదే మా అన్నోళ్లది. తన పేరు ఎర్రన్న ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాడు. ఏటా తనే కొన్ని ధాన్యం బస్తాలూ నాకూ ఇస్తాడు. రా వెళదాం అన్నోల్లింటికి”

అలాగే తోటలోంచి వెళితే పక్క ఇళ్లే ఎర్రన్నది. ప్రతి ఇంటి చుట్టూ కాంపౌండ్‌ లాంటి విభజన ఇంకా ఇక్కడ చేసుకోలేదు.

ఎర్రన్న ఇంటి చుట్టూ తోట... రకరకాల పూలు.. చెట్లు వసారా నుంచే ' అన్నా ' అని పిలుస్తూ మసన్న వెళుతున్నాడు. తన వెనకే నేనూ.

'రా మసన్న ' హాల్లోంచి మాటలు విన్సించి మేం లోపలికి వెళ్లాం.

సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న ఎర్రన్న నన్ను చూసి లేచాడు.

“అన్నా ఇతడు సూర్య, ఏదో పని మీద దేశం నుంచి వచ్చాడు. మనింట్లో కొన్ని రోజులు ఉండమని తీసుకువచ్చా.”

ఆయన నన్ను చూస్తూ కాస్త ఆశ్చర్యపోతూ దగ్గరగా వచ్చి...

“దేశంలో మన తెలుంగు గుంపు పెద్దదేనా”

“చాలా పెద్దది తొమ్మిది కోట్ల మందిమి ఉంటాం”

“'భలేగా ఉండే..” సంబరంగా నవ్వాడు ఎర్రన్న

“అన్నా లచ్చిమి లేదా?” మసన్న ఎవరి కోసమో వెతుకుతూ అడిగాడు.

“లేదు, పురానికి పోయింది... రేపొస్తాది అన్నాదు.

“మా అన్న కూతురు లచ్చిమి, తనే బుద్ద పాదాల యాత్రలో ఇండియా పోయి వచ్చినాది మసన్న చెబుతుంటే వింటున్నా కాని మనసులో మాత్రం బాధ.

“సూర్యా సాయంత్రం మనోళ్లందరినీ పిలిపిస్తా నువ్వు మాకు దేశం విశేషాలు చెప్పాల” ఎర్రన్న కోరాడు. సరేనని చెప్పా.

మళ్లీ కలుస్తాం అని చెప్పేసి మసన్న ఇంటికి వచ్చేశాం.

“నేను గదిలోకి వెళ్లి కూర్చుండిపోయాను. కిటీకీ లోంచి బయటకి చూస్తూ... కాసేపటికి బయట అలజడి మొదలైంది. వెళ్లి చూస్తే... చంటి పిల్లలతో తల్లులు, పడుచువాళ్లు, ముసలి వాళ్లు... ఆడామగా అంతా చేరి ఓ ముప్పై నలఖై మంది. వాళ్లలో వర్రన్న

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

43