పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవల

డి.పి. అనూరాధ 90100 16555








జరిగిన కధ ప్రవల్లికను వెతుకుతూ సూర్యవర్మ శ్రీలంక వెళతాడు. అనూహ్య వరిస్థితుల్లో కంటి కోట రాజ్యం గురించి తెలుసుకుంటాడు. శ్రీలంకను పరిపాలించిన అఖరు ప్రభువులు తెలుగు వారని తెలిసి ఆశ్చర్యపోతాడు. నేటికీ తెలుంగు మాట్లాడుతోన్న శ్రీలంక మూల వాసుల్ని కలుసుకుని విస్మయానికి గురై వాళ్ల ఊర్లలో పర్యటించడానికి బయల్దేరతాడు. అతడి కలల రాకుమారిని కలుసుకుంటాడా?


మసన్న అన్న కూతురి ద్వారా ప్రవల్లికను కలుసుకోవాలనే ఆరాటం. ఎప్పుడెప్పుడు ఊరు వెళతామా అని గడియారం చూస్తూ కూర్చున్నా. అసలు మసన్నది ఏ ఊరు. ఆ విషయమే అడగలేదన్న సంగతి గుర్తుకువచ్చింది.

“అన్నా మనది ఏ ఊరు”

“కలవేవ, అనురాథపురా నుంచి ఓ యాఖై కిలోమీటర్లు ఉంటాది. మనోళ్లందరమూ కోతుల్ని ఆడిస్తూనో, పాముల్ని ఆడిస్తూనో బతుకుతున్నాం. లంకోళ్లు మాకు 'అహికుంతికలు” అని పేరుపెట్టారు. ఈ దేశంలో మాది ప్రత్యేక జాతి. మేం సింహళోళ్లమే కాదు. తమిళులమూ కాదు. నిన్నా మొన్నటి వరకూ సంచార జీవితమే గడిపినాము. ఇప్పుడిప్పుడే ఇళ్లు కట్టుకుని ఓ చోట కుదురు కుంటున్నాం. పుత్తళం, దేవరగమ్మ, కుడాగమాలో మనోళ్లు ఎక్కువగా ఉండారు.

మనన్న మాటలు వింటుంటే నాకు మయున్నార్స్‌ “మన్‌ జాతీయులు గుర్తుకువచ్చారు. కానీ వాళ్ల మాతృభాష తెలుగుకాదు. అసలు తెలుగు నేల నుంచి వెళ్లిన సంగతినే వాళ్లు మరచిపోయారు. శ్రీలంక లోని ఈ 'మన జాతీయుల మాతృభాష తెలుగే. వీళ్లు ఎవరు? క్రీస్తు పూర్వం విజయుడితో ఇక్కడికి వచ్చారా? లేక అశోకుడి కూతురు సంఘమిత్ర సవరివారంలో ఉన్నారా? లేక శ్రీలంక మూల జాతీయులా? వాళ్ల గురించి నేషనల్‌ లైబ్రరీకి వెళ్లి సమాచారం సేకరించాలి. వీళ్ల తెలుగు మన తెలుగు లాగానే ఉంది. అక్కడక్కడ తమిళ, సింహళ పదాలు ఉన్నా సులభంగానే అర్థం అవుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో వలస వచ్చినవారా? మయన్మార్‌ “మన్‌” కూ శ్రీలంకలోని 'మన 'కూ ఏదైనా సంబంధం ఉందా? అన్నీ శేష ప్రశ్నలే.

“ఇదే కలవేవ మసన్న మాటలకి నా ఆలోచనల్ని పక్కన పెట్టాను. ప్రవల్లిక గురించి సమాచారం తెలుస్తుంది అనే ఊహే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈసారెలాగైనా నా ప్రేమను గెలిపించుకోవాలి.

అటు పెద్ద ఊరు కాదు చిన్నది కాదు కలవేవ... ఓ మోస్తరు నగరం. మసన్న ఇళ్ళెక్కడా అన్న ఆత్రంలో ఉన్నా నగరమంతా దాటేసి బయటికి వచ్చాం. కాస్త దూరం వెళ్లాక ఓ చిన్ని గ్రామం. మట్టి రోడ్లు. కొన్నీ ఇటుకలతో నిర్మిస్తే మరి కొన్ని గుడిసెలు. మామిడి చెట్లు వేప చెట్లు.. కొన్నిటికి చీర ఉయ్యాలలు వేలాడదీశారు.

“సూర్యా మనం ఇంటికి వెళ్లగానే నువ్వు టాక్సీని ఇడిపించేయి. అంత దవ్వు నుంచి వచ్చావు. మాతో కొన్ని రోజులు ఉండు. దేశం విషయాలు చెప్పు. మన వాళ్లందరూ చాలా సంతోషవెలయితరు.” మసన్న మాటలు కాదనలేకపోయాను.

“ఇదంతా మన తావే.. వారం రోజుల కంటే ఎక్కువ ఎక్కడా ఉండకుండా మా తాతముత్తాతలు ఉండారు. బయటి ప్రపంచాన్ని పట్టించుకోకుండా మా లోకంలో మేం ఉన్నాం. కానీ నాగరికత వల్ల మాకు నిలువు నీడ లేకుండా ఫోయింది. నలబై ఏళ్ల నుంచి ప్రభుత్వం మాకు మల్లు ఇచ్చింది. ఇలా ఇల్లు కట్టుకుంటున్నాం. మాలో ఎవరమూ చదువుకోలేదు. ఈనాటికీ మా తాతముత్తాతల్లా కోతుల్సి పాముల్ని ఆడిస్తూ పొట్టనింపుకుంటున్నాం. ”

శ్రీలంకలో తెలుంగు జాతి కష్టాల్ని మసన్న మాటలు తెలియజేస్తున్నాయి. వీళ్లు జిప్సీల్లాంటి వాళ్లన్నమాట. వీళ్లకి మన

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

42