పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడుతున్నారో పరిశోధించి చూపించే దిశగా ఈ కింది విధంగా విశ్లేషించాం.

సమాచారం -శ్రమ-విశ్లేషణ:

భాషకీ ఆదాయానికీ మధ్య సంబంధాన్ని నెలకొల్పేందుకు ఆధారభూతమైన సమాచారం సేకరించడం జరిగింది. ఈ సమాచార సేకరణ కొరకు హైదరాబాదు పరిసర ప్రాంతాలైన మెదక్‌, మహబూబ్ న్గగర్‌ జిల్లాల్లోని ఐదు పని స్థలాలను సందర్శించడమ్హైనది. ఎక్కడైతే మనుష్యులు తమ భాషను పనిస్టలాల్లో ఉపయోగిస్తూ పనిచేస్తారో అక్కడ భాష సంపదను ప్రభావితం చేసే చోటు అవుతుంది. ఒక వ్యక్తి తన పనిలో తోటి పనివారితో మాట్లాడేటప్పుడు ఉపయోగించే భాష పనీకి కావలసిన అవగాహనను కల్పిస్తుంది, సాంకేతిక ఉపయోగంలో వాడే భాష ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఆర్థిక లాభనష్టాలకు కారణమవుతుంది. కాబట్టి, సమాచార 'సేకరణకి పనిన్టలాలు సరైనవిగా భావించి వాటిని ఎన్నుకోవడం జరిగింది.

సమాచార సేకరణకై ఇచ్చిన 'ప్రశ్నావళిలో మొత్తం 20 ప్రశ్నలు పొందుపరచడం జరిగింది. ఇందులో మొదటి ఆరు ప్రశ్నలు వ్యక్తిగత వివరాలను సేకరించడానికై ఏర్పాటు చేయబడినవి, మిగతా ప్రశ్నలు భాష వాడుకను గూర్చిరూపొందించబడినవి. ప్రశ్నావళి ద్విభాషి తెలుగూ, ఇంగ్లీషూ రెండు భాషల్లో తయారు చేయబడింది. స్థానికంగా పనిచేసే వారి మాతృభాష తెలుగు కాబట్టి సమాచార సేకరణకు అనువైనది. ఇంగ్లీషు, ఇతర ప్రాంతాల నుండి పనికోసం వలస వచ్చిన వారికోసం ఉపయోగించడమైనది.

ఎంపిక చేసుకున్న ఐదు పనిస్థలాల్లో 1800 ఉద్యోగస్థుల నుండి సమాచార సేకరణ జరిగింది. పని స్థలాల్లో తమ తమ పనుల ఆధారంగా వారందరినీ మూడు విభాగాలుగా వర్గీకరించడమ్దైనది. ఈ పని స్థలాలో అధికారులైన ముఖ్య కార్యనిర్వాహణాధికారి, కార్య నిర్వాహకుడు, మానవ వనరుల అధికారి మొదలైనవారిని ఎగువ తరగతివారుగానూ, ఇంజినీర్లు పర్యవేక్షకులు, నిర్వాహకుడు మొదలైన వారినిమధ్య తరగతివారు గానూ, ఫిట్టర్లు సర్వీసింగ్‌, వెల్డర్లు, సహాయకులు, బీడి కూలీలు, వ్యవసాయ కూలీలు మొదలగువారినీ దిగువ తరగతివారుగానూ వర్గీకరించడమైనది.

ఎగువ తరగతివారి సంఖ్య మిగిలిన రెండు వర్షాలతో పోల్చితే చాల తక్కువ. పనిస్థలాల్లో మొత్తం పనివారి సంఖ్యలో వీరు 12.8 శాతం మట్టుకే ఉంటారు. వీరు ఇంగ్లీషు మాధ్యమంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసినవారు. పనిస్థలాల్లో వీరి చొరవ చాలా తక్కువ. వీరు క్రింది వర్షాలవారిపై అజమాయిషీ చేస్తూ ఉంటారు. క్రింది వర్గాలతో పోల్చితే వీరి భాషా వాడుక తక్కువగా ఉంటుంది. వారి సంభాషణలు ఎక్కువగా మధ్య తరగతి వారితోనే, చాలా వరకు ఇంగ్లీషు భాషలో ఉంటాయి.

1. మధ్య తరగతి వారు 37.8 శాతం ఉంటారు. వీరందరూ గ్రాడ్యుయేట్సే: వృత్తి పరమ్హైన కోర్సులు చేసినవారు. పనికి సంబంధించిన ప్రణాళికను తయారు చేయడం, ఆ ప్రకారంగా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

17