పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనిస్టలాల్లో పనిచేయించడం వీరి విధి. వీరు దిగువ వర్గం వారితో తెలుగు భాషలోనే సంభాషిస్తారు.

2. దిగువ తరగతి వారు పై రెండు వర్గాల వారికంటే సంఖ్యాపరంగా చాలా ఎక్కువ. పనిస్టలాల్లో వీరు 49.4 శాతం ఉంటారు. ఇందులో వృత్తిపరమైన కోర్సులు, డిప్లామా, ఇంటర్మీడియేట్‌, పదవ తరగతి మరియు చాల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వీరందరూ తెలుగు మాధ్యమంలో చదివినవారు.మాతృభాష అయిన తెలుగులో వ్యవహరిస్తారు. ఉత్పత్తి అధిక భాగం దిగువ తరగతి వారి నుండే వస్తుంది. మాతృభాషనే వీరు విరివిగా వాడతారు. పని సంబంధిత సూచనలూ, హెచ్చరికలూ ఉత్పత్తిలో భాగమైనవారందరికి తెలుగులోఉండడమే సహజం మధ్యతరగతివారు దిగువ తరగతివారితో జరిపే సంభాషణలూ, సూచనలూ, దిగువ తరగతివారు ఒకరితో ఒకరు వ్యవహరించడం, పరిశ్రమలు పొందుపరచిన పని సంబంధిత సమాచార పుస్తకాలు తెలుగులోనే ఉంటాయి. ఇంగ్లీషు వ్యవహారం ఉన్నతవర్గం వారికి మాత్రమే. పరిమితమ్హై కేవలం 12 శాతానికే పనిస్థలాల్లో వ్యవహరించ బడుతుంది. ఎంపిక గావింవబడ్డ పనిన్టలాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి, హైదరాబాదు పరిసర ప్రాంతాలు కాబట్టి హిందీ, ఉర్లూ 'ప్రభావితమైనవి కాబట్టి కొంతవరకూ హిందీ, ఉర్దూ వ్యవహారంలో వాడబడుతుంది. వీటితో పాటు తమిళం, ఒడియా భాషలు కూడా పని కోసం వలస వచ్చిన కొందరిచే వ్యవహరించ బడుతున్నాయి.

3. ఎంపిక చేయబడ్డ అన్ని పనిస్థలాల్లో శ్రామికులందరూ భారతీయభాషలని 89% శాతం, మరి ముఖ్యంగా వారి మాతృభాష తెలుగుని 80% శాతంమంది వ్యవహరిస్తున్నారు. దీన్నిబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు మాతృభాషలోనే జరుగుతున్నాయని తెలుస్తోంది. సంపద సృష్టికి మాతృభాష మూలంగా కనిపిస్తోంది. ఇలా సృష్టింపబడిన సంపద అంతా దేశ సంపదలో పాలిభాగం అవుతుంది. స్థూల జాతీయోత్పత్తి(GOP)లో ప్రాంతీయ భాషలు సింహభాగం అందిస్తూ, దేశాభ్యున్నతికి దోహదం చేస్తున్నాయి. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. సంపద సృష్టిలో ప్రాంతీయ భాషల వాడకం ద్వారా ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందని ఈ పరిశోధన వలన స్పష్టమవుతోంది. ప్రాంతీయ భాషల స్థితి ఎంత అరోగ్యంగా ఉంటే దేశ సంపద అంత అరోగ్యంగా ఉంటుంది. దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ భాషలను వచ్చే తరాలవారికి సమర్ధవంతంగా అందివ్వడానికి కంకణం కట్టుకోవాలి. ప్రాంతీయ భాషలు కాకుండా ఇంగ్లీషు నేర్చుకుంటేనే ఉద్యోగాలొస్తాయని జనం అపోహలో తమ పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమంలో చదివిస్తున్నారు. కాని ఈ పరిశోధన వల్ల ఇంగ్లీషు కేవలం 11% శాతానికే పనిస్థలాల్లో పరిమితమైనదని, దాన్ని మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువనీ సేకరించబడిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇంగ్లీషు నిరాయకంగా వాగ్దానం జేసే ఉద్యోగాలు కొన్ని మాత్రమేనని గుర్తించడమైనది. ఇంగ్లీషే అన్ని సమస్యలనూ నయంచేసే సంజీవని అని నమ్మే ప్రజలకి అది అపోహ అని ఈ పరిశోధన ద్వారా నిరూపించడమైంది ఈ వ్యాస రచయిత పరిశోధక విద్యార్థి, హైదరాబాదు విశ్వవిద్యా'యం

14 వ పుట తరువాయి.......

మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ 'సెమీ-ఇంగ్లీష్‌ పాఠశాలల నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు?

ఉంటుంది (NCERT 2006a:21). ఈ బదిలీ పిల్లల మొదటి భాషలో ఉన్నత స్థాయి నైపుణ్యం అభివృద్దిపై ఆధారపడి ఉంటుంది. అడ్డదార్లు అవసరంలేదు. పరివర్తనాలను క్రమంగా సాధారణంగా పాఠశాలలో నాలుగైదు సంవత్సరాల తరువాత ప్రణాళిక చేసుకోవాలి. బహుభాషా విద్యకు మద్దతు ఇవ్వడం సమాజానికి మంచిది. ఎందుకంటే ఇది అన్ని భాషలూ సంస్క్పృతుల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. మహారాష్టలోని సెమీ-ఇంగ్లీష్‌ పాఠశాలల అనుభవం ద్వారా నిరూపించబడినట్లుగా, ఈ విధానం వ్యక్తిగతంగా విద్యార్థులను ఇంగ్లీష్‌ కోసం వారి ఆశయ లక్ష్యాలలో ఏ విధంగానూ వైకల్యాన్ని కలిగించదని మనం ప్రజల నమ్మకాన్ని పెంచాలి. ప్రాధమిక విద్య మాతృభాషా మాధ్యమంలో ఉండాలని చాలా మంది నిపుణుల అనుభవం ద్వారా కూడా తెలుస్తోంది. ఏకభాషాదృష్టి బలంగా ఉంది. అది “పూర్తి ఇంగ్లీష్‌ మాధ్యమానికి పాఠశాలలనునెట్టివేస్తుంది. దీనికి ఉన్నత వర్గాల మద్దతు ఉంది. వీళ్లు దీన్ని రెండోరకం ఎంపికగా చూస్తారు. ఈ విరుద్ధమైన అభ్నిప్రాయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల కోసం ఆచరణీయ కార్యాచరణ ప్రణాళిక వైపు వెళ్ళాలి. వాడడం ఇంగ్లీషు వైవ్లు పరివర్తనలను విశ్వననీయం పద్ధతిలో నిర్వహించగలగాలి. అప్పుడే అకాంక్ష్మ కోరికలను తీర్చగల ప్రజల నమ్మకాన్ని సృష్టించవచ్చు. సామూహిక విద్యలో ఈ విశ్వసనీయ మార్గాలు లేకపోవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీన్తుంది.మహారాష్ట్రలోని సెమీ-ఇంగ్లీష్‌ పాఠశాలల అనుభవం మధ్యేమార్గంగా ఒక ఉదాహరణను అందిస్తోంది. మనం ద్వేషభావాన్ని వీడి పాఠశాలల కోసం తెలివైన విధానానికీ విశ్వసనీయమైన అచరణకూ మధ్య అంతరాన్ని దాటేందుకు వంతెన అవసరం...

larger“సొంత భాషలో చదువు మెదలు పెట్టటం అత్యంత సులువు. చదువును పిల్లలు హాయిగా, కష్టం లేకుండా,

larger

తెలుగుజాతి పత్రిక 'అమ్మనుడీ * నవంబరు-2020

18