పుట:ధనాభిరామము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

ధనాభిరామము

క. కీలాలజసంభవగో
   పాలార్చితపాదలోక! పరమేశ్వర! గో
   పాలకసంసేవిత! గో
   పాలమహాదేవ! రజతపర్వతసదనా. 110

స్రగ్విణి

   మౌనిలోకార్చితామ్నాయ! గంధర్వసం
   దానదేవాద్రికోదండనీలాంబరా
   దీనరత్నాకరా దివ్యతేజోమయా
   దానవారిప్రియా దక్షవాటీశ్వరా.

గద్య. ఇది శ్రీ వీరభద్రకృపాలబ్ధకవితావిశేషమహితచారిత్ర
    తిప్పయామాత్యపుత్ర నూతనకవిసూరయప్రణీతం బైన
    సకలజనాభిరామం బగుధనాభిరామం బనుమహాకావ్యంబు
    సర్వంబు తృతీయాశ్వాసము.

__________

చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి 'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము --1950.