పుట:ధనాభిరామము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

57


    గరుడవాహనము శంఖముఁ జక్రము దొఱంగి
             వినువీథి విహరించువిష్ణుఁ డొక్కొ
    జిగిమించు నాలుగుమొగములు దొలఁగించి
             యీరీతి నున్న వాగీశుఁ డొక్కొ
    కనుపట్టు తనవేయుగన్నులు నడఁచి యీ
             నటన దాల్చినసురనాథుఁ డొక్కొ[1]
    నిట్టి యైశ్వర్యమహిమయు నిట్టి సిరియు
    నిట్టి చాతుర్యబుద్ధియు నిట్టి విభవ
    మిట్టి తేజంబు నరులకు నేల కలుగు
    మనల రక్షింప వచ్చినమాయగాక. 22

చ. తనరినసిద్ధముఖ్యులు ముదంబున దగ్గఱి శిష్యసంఘమై
    తను నిరువంకలం గదిసి తద్దయుఁ గొల్వఁగ నాదినాథుఁ డీ
    యనువున ధారుణీవలయ మక్కట చూడఁగవచ్చెఁ గాన యం
    దును మఱియూరజోగులకుఁ దోరపుటీమహి మేల కల్గెడున్. 23

వ. అని సకలజనంబులుం గొనియాడుచుండ నంత. 24

చ. కలువలు నిక్క దమ్ములమొగంబులు ముచ్చ ముడుంగ, నింగి జు
    క్కలు మొనకట్ట మొత్తములు గట్ట విహంగమపఙ్తి నిద్దమున్
    నెలకొని చారుకోకముల నెమ్మనముల్ వెగడొంద నన్నిది
    క్కులఁ దమసంబు వర్వ రవి గ్రుంకెను పశ్చిమదిక్తటంబునన్. 25

వ. ఆలోన. 26

  1. దేవలోకము పవియు దేహిచిహ్నము వీడి దేవేశుఁడైన దేవేంద్రుఁడొక్కొ.