పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/693

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

627


అడవికిఁజనిరి బ్రాహ్మణసహస్రములు
కడువడి నేతేర గౌరవంబునను.
అనుచు సభావర్వమందలికథలు
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపించి శాస్త్రోక్తివిఖ్యాతముగాను
మునిసహస్రంబు లిమ్ములఁ బ్రస్తుతింప.
పంచఘంటానాద, పాండవాహ్లాద,
పంచాస్త్రసమశౌర్య, భర్మాద్రిధైర్య,
శ్రీరంగయామాత్యశేఖరపుత్ర,
కారుణ్యనిధి, దానకర్ణావతార,
శ్రీయనంతామాత్యశేఖరోత్తంస,
కాయజసమమూర్తి, కమనీయకీర్తి,
ధర్మసమగ్రంబు తలకొన్నయదియుఁ
బేర్మిఁ బుణ్యంబులఁ బెనుపొందునదియు
నసమసాహిత్యవిద్యాచతుర్ముఖుఁడు
రసికుండు బాలసరస్వతీశ్వరుఁడు
పసనొనర్చిన సభాపర్వంబునందు
నసదృశంబుగ ద్వితీయాశ్వాసమయ్యె.


ఇది సభాపర్వము.

శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి నాయఁడు గారిచే రాజమండ్రి సరస్వతీ పవర్ ప్రెస్ నందు ముద్రింపఁబడినది — 1942.