పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ద్విపద భారతము


ఖర దూషణాది రాక్షసమర్మ భేది,
మరణ శేషిత తుంగ మాయాకురంగ,
సీతావియోగ, సుశీల ప్రయోగ,
ధౌతకబంధ పాతక పంక బంధ,
సుగ్రీవకృతసఖ్య, సురదత్తసౌఖ్య,
విగ్రహ ప్రియ వాలి విడళనశాలి ,
పంపాసరస్తీర భవ్యవిహార,
సంపాతికృతమార్గ సైనికవర్గ,
సీతాశిరోరత్న శీలితయత్న,
ఆతతలంకా ప్రయాణనిశ్శంక,
సరసవిభీషణ స్థాపననిపుణ,
శరధినిర్మిత బంధ, సాధుసంబంధ,
క్షపితరావణ కుంభకర్ణ సంరంభ,
కపిసైన్యజీవరక్షణ, గతదైన్య,
నిష్పాప మైథిలీ నియమితకోప ,
పుష్పకారోహణ భోగనిర్వహణ,
[1]యిద్ధవిభాగ్రామ, యినకులసోమ,
సిద్ధసాక లక్ష్మీమనోపేత,
జయ జయ గుణధామ, జయ రఘురామ,
జయ నిత్యకల్యాణ, చకితసంత్రాణ,
నీకు నేఁ జెప్పఁబూనిన కథా క్రమము
చేకొని విన్నవించెదఁ జిత్తగింపు.
అని నిర్మల ధ్యాన మాత్మలో నిలిపి
కనుఁగొంటిఁ ; దత్కథాశ్రమమెట్టిదనిన ;
భూమిలో సారమై పొలుపొందునట్టి
నైమిశారణ్య పుణ్యక్షేత్రమునను

  1. ఇద్దనభాగామ ఇనతలస్తోమ (మూ)