పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

562

ద్విపద భారతము.


సఫలమైయుండును జగమెల్ల నెఱుఁగ;
సభికసంస్తుతుల, నేఁజతురుండ నైతి; (?)
ద్వారావతీపురీస్థలినుండి నీవు
దూరంబుగానుండఁ దోచు మామదికి ;
శుభములుదలఁచు మెచ్చోటను మాకు ;
నిభరాజవరద, నిన్నెంతయుఁ బాసి
నిమషమాత్రంబును నిలువనోదుదుము
క్రమముతో." ననవు డు కంజనాభుండు
నాధర్మనందను నట్లూఱడించి
సాధులు నుతియింప సంతోషమునను
అనిలవేగములైన హయములుపూను
కనకరథంబెక్కి కదలిపోవుటయు,
ధర్మతనూజుండు తమ్ములుఁ దానుఁ
బేర్మిఁ గృష్ణునినంపి పెరిమనేతెంచి
యుండంగ, మేటిసుయోధనుండంత

మయసభాసందర్శనమున దుర్యోధనుఁడు లజ్జితుఁడగుట

దండితో శకునియుఁ దానును గూడి
సమధికంబైన యాసభఁ జూచు వేడ్క
గొమరొప్ప నక్కడ కొన్నిదినములు
నిలిచి యాసభరమణీయతఁ జూచి,
లలిత నిరంతరాలంకారమహిమఁ
దేజంబుతోఁ దత్ప్రేదేశంబునందు
రాజితంబైన ద్వారమున నెయ్యమున[1]
.......... ........ ....... ....... ........ .........
......... ....... ....... ........ ........ .......

  1. గ్రంథపాతమైయుండును. చూ, నన్నయ. భా.