పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

523


పలికితి దుర్భుద్ధి, పాపంబునందు;
మలసి పుణ్యుఁ నవమానంబు చేయు
చుండితి నీకంటయోధులు లేరె!
మండలంబున; మహమదగర్వమునను
గార్తవీర్యుండు భార్గవునిచే దెగియె;
ధూర్తవిద్యలయందుఁ దుది నింకనీవు
చెడక నావచనంబుచేసి రాజులను
విడిచిపుచ్చుము జగద్విఖ్యాతముగను;
విడునకుండెద వేని, వేగ నీతనువు
విడిపింపుదుము బలువిడితోడ." ననిన

భీమజరాసంధుల మల్లయుద్ధము

రౌద్రంబుతోడ జరాసంధుఁ డపుడు
భద్రేభవరదుని బహుభాషలాడి
బిరుదుప్రతాపించి భీమునితోడ
దురము సేయఁదలంచి, దుదిఁ దనపుత్రుఁ
ద్రిభువనస్తుతు సహదేవు నుత్తముని
నభిషిక్తుఁజేసి, నిజాప్తభూసురుల
దీవనల్ గైకొని, దిక్కులల్లాడ
లావునఁబొంగి, లీలను గాసెగట్టి,
పాపిట [1]చొళ్లెంబు బాగుగాదీర్చి
చూపట్టెదగ్గఱ; చూడ భీముఁడును
సర్వ[2]సారగ్రంధు సతతమదాంధు
నుర్వీశనిర్బంధు యుక్తిసంబంధు
గాంభీర్యగుణసింధు గతసత్యసంధు
జంభారిరిపుబంధు జయజరాసంధుఁ

  1. సూళ్లెంబు
  2. సర్వ (మూ)